Goa Election Results : బీజేపీ ఆఫర్ కాదని స్వతంత్రంగా పోటీ.. గోవాలో ఉత్పల్ పారికర్ ఓటమికి కారణమిదేనా..?

Goa Election Results : గోవాలోని పనాజీ మళ్లీ బీజేపీనే వరించింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దివంగత నేత మనోహర్​ పారికర్​ కుమారుడు ఉత్పల్ పారికర్ పరాజయం పాలయ్యారు.

Goa Election Results : బీజేపీ ఆఫర్ కాదని స్వతంత్రంగా పోటీ.. గోవాలో ఉత్పల్ పారికర్ ఓటమికి కారణమిదేనా..?

Goa Election Results Ex Cm Manohar Parrikar’s Son Utpal Loses To Bjp’s Atanasio Monserratte From Panaji

Goa Election Results : గోవాలోని పనాజీ మళ్లీ బీజేపీనే వరించింది. అక్కడి ప్రజలు బీజేపీకే మళ్లీ పట్టం కట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దివంగత నేత మనోహర్​ పారికర్​ కుమారుడు ఉత్పల్​ పారికర్​ పరాజయం పాలయ్యారు. తండ్రి పారికర్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. బీజేపీ అభ్యర్థి అటనాసియో మొన్సెరేట్​​ ఉత్పల్ పారికర్‌‌పై 800 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీజేపీతో విభేదాల కారణంగా స్వతంత్రంగా పోటీ చేసిన ఉత్పల్​కు ఈ ఎన్నికల్లో నిరాశ తప్పలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీకి గట్టి పోటీని ఇచ్చినప్పటికీ ఫలితాలు నిరాశ కలిగించాయని ఫలితాలు అనంతరం ఉత్పల్ వ్యాఖ్యానించారు.

తండ్రి పారికర్ నియోజక వర్గం నుంచే పోటీ చేయాలని భావించిన ఉత్పల్ పారికర్ కు బీజేపీ షాకిచ్చింది. ఉత్పల్‌ను కాదని ఆయన స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చాన్స్ ఇచ్చింది. ఆ స్థానం మినహా మరో రెండు స్థానాల్లో నుంచి పోటీ చేసేందుకు వీలు కల్పించింది. కానీ, పారికర్ కుమారుడు మాత్రం తన తండ్రి నియోజకవర్గం నుంచే పోటీచేస్తానంటూ బీజేపీ ఇచ్చిన ఆఫర్ నిరాకరించాడు. ఎలాగైనా తన తండ్రి నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని భావించిన ఉత్పల్.. బీజేపీను వీడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ తమ పార్టీలో చేరమంటూ ఉత్పల్ కు ఆఫర్ ఇచ్చింది. అది కూడా ఉత్పల్ తిరస్కరించాడు. స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

Goa Election Results Ex Cm Manohar Parrikar’s Son Utpal Loses To Bjp’s Atanasio Monserratte From Panaji (2)

Goa Election Results Ex Cm Manohar Parrikar’s Son Utpal Loses To Bjp’s Atanasio Monserratte From Panaji 

గత నెల 14న గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తన తండ్రి నియోజకవర్గం నుంచి ఉత్పల్ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో ఓట్లు చీలి చివరికి ఓటమి పాలయ్యారు. తండ్రి మనోహార్ పారికర్ స్థానం నుంచి పోటీ చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారని భావించిన ఉత్పల్ కు నిరాశే ఎదురైంది. తన ఓటమిని ముందే గ్రహించిన ఉత్పల్.. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో కౌంటింగ్ కేంద్రం నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. తాను ఆశించినంతగా ఓట్లు రాకపోవడటంతో నిరాశలో ఉండిపోయారు. మంచి ఓట్లు సాధించానంటూనే ఫలితాలు నిరాశ పరిచాయని ఉత్పల్ చెప్పుకొచ్చారు.

గోవాలో బీజేపీకి పెద్ద దిక్కు అయిన నేతల్లో ఒకరైన మనోహర్ పారికర్.. మరణించే వరకూ 25 ఏళ్ల పాటు పనాజీ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి మనోహర్ పారికర్ మరణం తర్వాత పనాజీ ఉప-ఎన్నికల్లో పోటీకి ఉత్పల్ సిద్ధమయ్యారు. కానీ, బీజేపీ మాత్రం వారసత్వంగా ఉత్పల్‌కు ఆ టికెట్ ఇచ్చేందుకు వెనక్కు తగ్గింది. పారికర్ అనుయాయుడు సిద్ధార్థ్ కున్‌కోయిలైకర్‌ను ఆ స్థానంలో పోటికి దింపింది. దాంతో ఉత్పల్ పారికర్ బీజేపీ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.

Read Also : Punjab Election Review: పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచిన “త్రిమూర్తులు”