కాసుల కోసం కక్కుర్తి : సీఎంకే బెదిరింపులు..అరెస్ట్ చేసిన పోలీసులు

  • Published By: nagamani ,Published On : November 17, 2020 / 10:24 AM IST
కాసుల కోసం కక్కుర్తి : సీఎంకే బెదిరింపులు..అరెస్ట్ చేసిన పోలీసులు

Goa man arrested for messages to CM pramod sawant : కష్టపడే తత్వం లేనివాళ్లు దొంగతనాలకు పాల్పడుతుంటారు. కానీ డబ్బుల కోసం ఓ యువకుడు ఎంతోమందిని బెదిరించాడు. అక్కడితో ఊరుకోకుండా ఏకంగా సీఎంకే ధమ్కీ ఇద్దామనుకున్నాడు. ఆయన్ని దూషిస్తూ పోస్టులు కూడా పెట్టి అడ్డంగా బుక్ అయిపోయాడు.పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను బెదిరిస్తున్న యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.



వివరాల్లోకి వెళితే..దక్షిణ గోవాలోని సాంకోలే గ్రామానికి చెందిన ఆశిష్ నాయక్ అనే 25 ఏళ్ల యువకుడు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం ప్రమోద్ సావంత్‌కు మెసేజ్‌లు పంపించాడు. తనకు వెంటనే డబ్బులు ఇవ్వాలని ఏదో రాసిచ్చుకున్నట్లుగా డిమాండ్ చేశాడు. అక్కడితో ఊరుకోకుండా మరింతగా రెచ్చిపోయాడు.


సీఎం ప్రమోద్ సావంత్ ను దూషిస్తూ అసభ్యకరమైన మెసేజ్ లు పంపించాడు. దీంతో సీఎం ప్రమోద్ సావంత్ సదరు వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయమని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.


అతణ్ణి అరెస్ట్ చేసి విచారించగా సీఎంనే కాకుండా ఎంతోమందిని డబ్బుల కోసం బెదిరించినట్లుగా తేలింది. పలువురి ఫోన్ నంబర్లు సేకరించటం వాటిని మెసేజ్‌లు పెట్టటం చేస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతను బెదిరింపులకు వినియోగించేది ఇంటర్నేషనల్ నంబర్ అని పోలీసులు గుర్తించారు.



https://10tv.in/olympic-champion-ruben-limardo-works-as-food-delivery/
అంతేకాదు పలువురిని మెసేజ్ ల ద్వారా బెదిరిస్తూ నా పేరు ఫలానా అంటూ తనకు ఎనిమిగా ఉండే ఓ వ్యక్తి పేరును మెసేజుల్లో ప్రస్తావించేవాడని పోలీసులు తెలిపారు. కాగా..నవంబరు 5న సీఎం ప్రమోద్ సావంత్ పోలీసులకు ఆదేశాలు జారీచేయగా..రెండు రోజుల తర్వాత గోవా ఫార్వార్డ్ పార్టీ ఉపాధ్యక్షుడు దుర్గాదాస్ కామత్ కూడా తనకు ఇలాంటి బెదిరింపు మేసేజ్‌లు వచ్చినట్టు పోండా పోలీసులకు ఫిర్యాదు చేశారు.


బీజేపీ మాజీ నేత ప్రణవ్ సన్వోర్దేకర్ చర్చోరమ్ కూడా పోలీసులకు ఇలాంటి ఫిర్యాదే చేయడం గమనించాల్సిన విషయం. అంటే బెదిరింపులకు వాళ్లు వీళ్లు అనే తేడా నాకు అవసరం లేదు..పోతే మెసేజ్ లే కదా..వస్తే డబ్బులు వచ్చి పడతాయనే కాన్సెప్ట్ తో ఆశిష్ నాయక్ పనిగా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు.