Gods Distribute Masks : శ్రీరామనవమి పర్వదినాన.. ప్రజలకు మాస్కులు పంచిన దేవుళ్లు

దేశ‌మంత‌టా క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా రోజూ రెండున్న‌ర ల‌క్ష‌ల‌కుపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మంగ‌ళ‌వారం(ఏప్రిల్ 20,2021) ఉద‌యం నుంచి బుధ‌వారం(ఏప్రిల్ 21,2021) ఉద‌యం వ‌ర‌కు గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 2.95 ల‌క్ష‌ల కొత్త కేసులు న‌మోద‌య్యాయి. అయినా కొందరు ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా

Gods Distribute Masks : శ్రీరామనవమి పర్వదినాన.. ప్రజలకు మాస్కులు పంచిన దేవుళ్లు

Gods Distribute Masks

Gods Distribute Masks : దేశ‌మంత‌టా క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా రోజూ రెండున్న‌ర ల‌క్ష‌ల‌కుపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మంగ‌ళ‌వారం(ఏప్రిల్ 20,2021) ఉద‌యం నుంచి బుధ‌వారం(ఏప్రిల్ 21,2021) ఉద‌యం వ‌ర‌కు గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 2.95 ల‌క్ష‌ల కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఒక్కరోజే 2వేల 23మంది మరణించారు. అయినా కొందరు ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖాల‌కు మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం లాంటి నిబంధ‌న‌ల‌ను గాలికొదిలేశారు. కరోనాతో గేమ్స్ ఆడి ప్రాణాలను రిస్క్ లో పడేస్తున్నారు. అలాంటి వ్యక్తుల వల్ల ఇతరులకూ ముప్పు పొంచి ఉంది.

ఈ నేప‌థ్యంలో బెంగ‌ళూరులోని ఓ హోట‌ల్‌లో ప‌నిచేసే అభిషేక్‌, న‌వీన్‌, భాష అనే ముగ్గురు వ్య‌క్తులు వినూత్న రీతిలో క‌రోనా మ‌హ‌మ్మారి గురించి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. శ్రీరామ న‌వ‌మి కావ‌డంతో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హ‌నుమంతుడి వేషాలు ధరించారు. స్థానికంగా గ‌ల్లీగ‌ల్లీ తిరుగుతూ ఫేస్ మాస్కులు పంపిణీ చేస్తున్నారు. మాస్కులు లేకుండా రోడ్ల‌పైకి వ‌చ్చే వారిని గుర్తించి మాస్కులు ధ‌రింప జేస్తున్నారు.

హోటల్ లో పని చేసే ఆ ముగ్గురి ప్రయత్నం అందరి దృష్టి ఆకర్షించింది. కరోనా నిబంధనలపై వారు కల్పిస్తున్న అవగాహనను అంతా అభినందిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చినా కరోనా మహమ్మారి తీవ్రత తగ్గడం లేదు. ఈ క్రమంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు అందరూ తప్పనిసరిగా పాటించాలి. ప్రజలంతా కచ్చితంగా నిబంధనలు పాటిస్తేనే కరోనాను కట్టడి చెయ్యగలం. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.