Government Teacher : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలను బడికి రప్పించేందుకు ప్రభుత్వ స్కూల్ టీచర్ సూపర్ ఐడియా

సాధారణంగా ప్రభుత్వ బడులు అంటే.. అందరికీ చులకనే. ఏ పేరెంట్స్ కూడా సర్కారీ బడులవైపు చూడరు. తమ పిల్లలను అక్కడ చేర్చాలంటే ఆలోచిస్తారు. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు ఉండవని, బోధనా విధానం సరిగా ఉండదని, నాణ్యమైన విద్య అందదని, టీచర్లు రారనేది తల్లిదండ్రుల భావన. ఇలాంటి కారణాలతో చాలామంది పేరెంట్స్.. ఖర్చు ఎక్కువైనా పర్లేదని.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపుతారు.

Government Teacher : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలను బడికి రప్పించేందుకు ప్రభుత్వ స్కూల్ టీచర్ సూపర్ ఐడియా

Government Teacher Rekha Prabhakar

Government Teacher : సాధారణంగా ప్రభుత్వ బడులు అంటే.. అందరికీ చులకనే. ఏ పేరెంట్స్ కూడా సర్కారీ బడులవైపు చూడరు. తమ పిల్లలను అక్కడ చేర్చాలంటే ఆలోచిస్తారు. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు ఉండవని, బోధనా విధానం సరిగా ఉండదని, నాణ్యమైన విద్య అందదని, టీచర్లు రారనేది తల్లిదండ్రుల భావన. ఇలాంటి కారణాలతో చాలామంది పేరెంట్స్.. ఖర్చు ఎక్కువైనా పర్లేదని.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపుతారు.

ఈ పరిస్థితుల్లో ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ ఐడియా అందరిని అట్రాక్ట్ చేస్తోంది. అంతేకాదు అందరి హృదయాలను గెలుచుకున్నారు. పిల్లలను ప్రభుత్వ స్కూల్ కి రప్పించేందుకు ఆ టీచర్ వినూత్న విధానం అమలు చేస్తున్నారు. ఆ సర్కారీ స్కూల్లో ఒకటో తరగతిలో చేరే ప్రతి స్టూడెంట్ పేరిట 1000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు టీచర్. సదరు విద్యార్థి 10వ తరగతి పూర్తయ్యాక ఆ వెయ్యి రూపాయలు వడ్డీతో సహా డ్రా చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన సొంత డబ్బుతో ఈ పథకం అమలు చేస్తున్నారు ఆ ఉపాధ్యాయురాలు. ఆమె పేరు రేఖా ప్రభాకర్. కర్నాటక రాష్ట్రం శివమొగ్గ తాలూకాలోని నల్లిగేరే ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారామె.

రేఖా ప్రభాకర్ మాటలకే పరిమితం కాలేదు. ఆచరణలో చూపించారు. ఒకటి కాదు రెండు కాదు గత ఏడేళ్లుగా ఆమె ఈ పని చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 63మంది విద్యార్థుల పేరిట వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశారు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు తన చేతుల మీదుగా బాండ్స్ ఇచ్చారు రేఖా ప్రభాకర్.

రేఖా పరభాకర్ కుండపూర్ తాలుకా శంకర్ నారాయణ గ్రామవాసి. 2010లో నల్లిగేరే ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా చేరారు. తొలుత స్కూల్ లో 100మంది విద్యార్థులు ఉండే వారు. క్రమంగా ఆ సంఖ్య తగ్గింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న టీచర్ రేఖా.. వెయ్యి రూపాయలు డిపాజిట్ ఐడియాను ప్రవేశపెట్టారు. 2014 నుంచి ఈ విధానం అమలు చేశారు. ”ఒకటవ తరగతిలో చేరిన పిల్లల పేరిట వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశాను. స్కూల్ కి వచ్చే పిల్లలంతా పేద కుటుంబాలకు చెందిన వారే. స్కూల్ చదువు అయ్యాక కాలేజీ చదువుకి ఆ డబ్బు ఉపయోగపడుతుంది” అని టీచర్ రేఖా ప్రభాకర్ అన్నారు. టీచర్ రేఖా కృషి వృథా కాలేదు. మెల్లగా స్కూల్ లో చేరే పిల్లల సంఖ్య పెరిగింది.

ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుని క్లాసులకు సరిగా రాని పాఠాలు సరిగా చెప్పని టీచర్లు ఉన్న ఈ రోజుల్లో.. రేఖా లాంటి పంతులమ్మలు ఉన్నారంటే విస్మయం కలిగిస్తోంది. అదీ తన సొంత డబ్బుతో ఆమె ఈ పని చెయ్యడం నిజంగా గ్రేటే. ఆ టీచర్ పెద్ద మనసుకి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మీరు నిజంగా గ్రేట్ అని కితాబిస్తున్నారు. రేఖా ప్రభాకర్.. ప్రభుత్వ స్కూల్స్ లో పని చేసే టీచర్లకు ఆదర్శంగా నిలిచారు.