Governor RN Ravi: తమిళనాడు పేరు మార్పు వివాదంపై క్షమాపణలు చెప్పిన గవర్నర్

జనవరి 4న చెన్నైలోని రాజ్‭భవన్‭లో కాశీ తమిళ సంఘం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు బదులు ‘తమిళగం’ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం రెండుసార్లు ఆ పేరును అలాగే పలికారు. పైగా తమిళనాడు పేరును అలాగే మార్చాలని అన్నారు. దీంతో అధికారంలో ఉన్న డీఎంకే సహా తమిళ రాజకీయ పార్టీలన్నీ గవర్నర్ మీద నిప్పులు చెరిగాయి.

Governor RN Ravi: తమిళనాడు పేరు మార్పు వివాదంపై క్షమాపణలు చెప్పిన గవర్నర్

Governor RN Ravi's clarification over 'Tamizhagam' row

Governor RN Ravi: తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తప్పుగా వ్యాఖ్యానించానని, ఏదో అయోమయంలో అలా అన్నానని బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. జనవరి 4న చెన్నైలోని రాజ్‭భవన్‭లో కాశీ తమిళ సంఘం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు బదులు ‘తమిళగం’ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం రెండుసార్లు ఆ పేరును అలాగే పలికారు. పైగా తమిళనాడు పేరును అలాగే మార్చాలని అన్నారు. దీంతో అధికారంలో ఉన్న డీఎంకే సహా తమిళ రాజకీయ పార్టీలన్నీ గవర్నర్ మీద నిప్పులు చెరిగాయి.

Assembly Election: ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. మూడు రాష్ట్రాల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

కాగా, తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ రవి మాట్లాడుతూ ‘‘జనవరి 4న చెన్నైలోని రాజ్‭భవన్‭లో జరిగిన సమావేశంలో కాశీ తమిళ సంఘం కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా, కాశీతో తమిళ ప్రజల పురాతన సాంస్కృతిక అనుబంధాన్ని చెప్పడానికి ‘తమిళగం’ అనే పదాన్ని సూచించాను. వాస్తవానికి ఆ రోజుల్లో తమిళనాడు లేదు. అందుకే చారిత్రక, సాంస్కృతిక సందర్భంలో నేను ‘తమిళగం’ అనే పదాన్ని సముచితమైన వ్యక్తీకరణగా సూచించాను. కానీ అది తప్పుడుగా వెళ్లింది. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. కానీ, నేను తమిళనాడు అనే పదానికి వ్యతిరేకమనే ప్రచారం జరుగుతోంది. అందుకే వివరణ ఇస్తున్నాను’’ అని అన్నారు.

Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు