Amphotericin-B Injections : ‘ఆమ్ ఫోటెరిసిన్-బీ’ఇంజెక్షన్ల ఎగుమతిపై నిషేధం

బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ లో వాడే ఆమ్ ఫోటెరిసిన్-B ఇంజెక్షన్ల ఎగుమతిపై భారత్ నిషేధం విధించింది.

Amphotericin-B Injections : ‘ఆమ్ ఫోటెరిసిన్-బీ’ఇంజెక్షన్ల ఎగుమతిపై నిషేధం

Govt Imposes Ban On Export Of Amphotericin B Injections

Amphotericin-B Injections బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ లో వాడే ఆమ్ ఫోటెరిసిన్-B ఇంజెక్షన్ల ఎగుమతిపై భారత్ నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా క్రమంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న సమయంలో ఈ వ్యాధి ట్రీట్మెంట్ కు వాడే డ్రగ్స్ కొరత నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం DGFT(Directorate General of Foreign Trade)ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

DGFT నోటిఫికేషన్ ప్రకారం..ఆమ్ ఫోటెరిసిన్-B ఇంజెక్షన్ల ఎగుమతిని నిషేధిత జాబితాలో చేర్చారు. అంటే,ఎగుమతిదారుడు దీని అర్థం, ఎగుమతిదారు దానిని బయటిదేశాలకు సరఫరా చేయాలంటే డైరెక్టరేట్ నుండి అనుమతి లేదా లైసెన్స్ అవసరం. ఆమ్ ఫోటెరిసిన్ -B ఇంజెక్షన్ల ఎగుమతి తక్షణ ప్రభావంతో పరిమితం చేయబడింది అని నోటిఫికేషన్ తెలిపింది.