Vaccine Doses : 44 కోట్ల వ్యాక్సిన్ డోసులకు కేంద్రం ఆర్డర్

కొత్త వ్యాక్సిన్​ పాలసీని సోమవారం ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ 44 కోట్ల కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ డోసులకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.

Vaccine Doses : 44 కోట్ల వ్యాక్సిన్ డోసులకు కేంద్రం ఆర్డర్

Vaccine Doses

Vaccine Doses కొత్త వ్యాక్సిన్​ పాలసీని సోమవారం ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ 44 కోట్ల కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ డోసులకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. సీరం సంస్థ నుంచి 25 కోట్ల కొవిషీల్డ్ డోసులను, భారత్​ బయోటెక్​ నుంచి 19 కోట్ల కొవాగ్జిన్​ డోసులకు ఆర్డర్​ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే కొనుగోలుకు అయ్యే మొత్తంలో 30 శాతాన్ని సంబంధింత సంస్థలకు చెల్లించినట్లు స్పష్టం చేసింది. ఆగస్టు-డిసెంబర్ మధ్య ఉత్పత్తిదారులు ఈ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా, దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదేనని సోమవారం ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి కేంద్రమే డోసులు కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని, దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ను ఉచితంగానే అందిస్తామని ప్రకటించారు.

జూన్- 21 నుంచి 18 ఏళ్లకు పైబడిన అందరికీ కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ డోసులు అందిస్తుందని ప్రధాని తెలిపారు. ఎవరైనా ఉచిత టీకా వద్దనుకుంటే సొంతఖర్చుతో ప్రైవేటుగా టీకా వేయించుకోవచ్చని పేర్కొన్నారు. రూ.150 సర్వీస్ చార్జితో ప్రైవేటుగా వ్యాక్సిన్ పొందవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్లలో 25 శాతాన్ని ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచుతామని తెలిపారు.