Corona effect : కాటికాపరిగా మారిన ఉద్యోగి..శ్మశానంలోనే కాపురం..

గుజరాత్‌లోని వడోదరలో గల ఒక స్మశానవాటికలో మహారాష్ట్రకు చెందిన కన్నయ్యాలాల్ కాటికాపరిగా పనిచేస్తున్నాడు. కానీ కరోనా కష్టం అన్నీ చేయాల్సిన పరిస్థితుల్ని తీసుకొచ్చింది. దీంతో ఈ శ్మశసానికి కరోనాతో చనిపోయినవారి మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించిన అన్ని పనులు చేస్తున్నాడు.

Corona effect : కాటికాపరిగా మారిన ఉద్యోగి..శ్మశానంలోనే కాపురం..

Corona Effect

Corona effect on employee :  కరోనా..కరోనా..కరోనా. జీవితాలను తల్లక్రిందులు చేసేసింది.ఉద్యోగాలను, ఉపాధిని ఛిన్నా భిన్నం చేసి పారేసింది. ఎక్కడివారక్కడ గప్ చిప్ అన్నట్లుగా దాగుడుమూతలు ఆడుతోంది మనుషుల జీవితాలతో. ఉద్యోగాలు పోయి వీధినపడ్డవారంతా తమ కుటుంబాలను పోషించుకోవటానికి చేతనంత పని చేస్తున్నారు. అది చిన్నదా? పెద్దదా? ఆలోచించటంలేదు. రోజులు గడిస్తే చాలు.

7

కుటుంబానికి ఇంత అన్నం పెడితే చాలు అన్నట్లుగా ఉంది పరిస్థితి. టీచర్ ఉద్యోగం చేసేవారు కూరగాయాలు అమ్ముకుని.లాయర్ పనిచేసేవాళ్లు తట్టలు, బుట్టలు అల్లుకుని, కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు వీధి వీధి తిరిగి చీపుళ్లు కూడా అమ్ముకుని బతుకుతున్న భయంకరమైన దుస్థితుల్లోకి నెట్టేసింది కరోనా మహమ్మారి.

4

ఈక్రమంలో ఓ కంపెనీలో చక్కటి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంతో హాయిగా బతికే ఓ ఉద్యోగిని కనీవినీ ఎరుగని రీతిలో కాటికాపరిగా మార్చేసింది ఈ కరోనా మహమ్మారి. నీతికి నిజాయితీకి. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆడితప్పని మహాచక్రవర్తి హరిశ్చంద్రడిని విధి కాటికాపరిని చేస్తే..గుజరాత్‌లోని వడోదరలో ఓ కంపెనీ ఉద్యోగిని ఈ కరోనా మహమ్మారికి కాటికాపరిని చేసింది.

1

దేశంలో రోజురోజుకూ కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో స్మశానాలకు తరలి వస్తున్న మృతదేహాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇటువంటి సమయంలో ఒక కంపెనీలో పరిచేసే ఉద్యోగి కరోనా కష్టంలో ఉద్యోగాన్ని పోగొట్టుకుని కాటికాపరిగా మరాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి వడోదరలోని శ్మశానవాటికనే ఇంటిగా మార్చుకున్నాడు. అక్కడే కాపురం ఉంటూ కరోనాతో చనిపోయిన మతదేహాలను తగులబెట్టే కాటికాపరి ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి చేదోడు వాదోడుగా అతని భార్యకూడా సహాయంగా పనులు చేస్తోంది.

2

వివరాల్లోకి వెళితే గుజరాత్‌లోని వడోదరలో గల ఒక స్మశానవాటికలో మహారాష్ట్రకు చెందిన కన్నయ్యాలాల్ కాటికాపరిగా పనిచేస్తున్నాడు. అతనికి అంతకు ముందు ఇటువంటి పనులు అలవాటు లేదు. కానీ కరోనా కష్టం అన్నీ చేయాల్సిన పరిస్థితుల్ని తీసుకొచ్చింది. దీంతో ఈ శ్మశసానికి కరోనాతో చనిపోయినవారి మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించిన అన్ని పనులు చేస్తున్నాడు.

9

కరోనా లాక్‌డౌన్‌లో ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి కన్నయ్యాలాల్ గత సంవత్సం నుంచి వడోదర పరిధిలోని వాసనా గ్రామంలోని స్మశాన వాటికలోనే ఉంటున్నాడు. ఇక్కడికి వస్తున్న కరోనా మృతదేహాలకు సైతం అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. శ్మశానాన్నే ఇల్లు చేసుకున్నాడు. భార్యా, ఇద్దరు పిల్లలతో సహా అక్కడే కాపురం ఉంటున్నాడు.