Grenade Launcher: పోలీసులపై గ్రనేడ్ దాడి

జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. అదృష్టవశాత్తు గ్రనేడ్ పోలీసులకు దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది.

Grenade Launcher: పోలీసులపై గ్రనేడ్ దాడి

Grenade Launcher

Grenade Launcher:  జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. అదృష్టవశాత్తు గ్రనేడ్ పోలీసులకు దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడిలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు మీడియాకు తెలిపారు. సాంబా-ఉధంపూర్‌ రోడ్‌లో నాడ్‌ వద్ద మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు.

ఈ గ్రనేడ్ పోలీసులు ఉన్న ప్రాంతానికి దూరంగా పడి పేలింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు చుట్టుపక్కల తనిఖీ చేపట్టారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. మూడు టీంలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి భద్రతా దళాలు.