Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల సమరం.. ఏడుగురు రెబల్స్‌పై వేటు వేసిన బీజేపీ..

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారిలో మధు శ్రీవాస్తవ, అరవింద్ లడానీ, దిను పటేల్, హర్షద్ వాసవ, ధవల్ సింగ్ ఝాలా పేర్లు ఉన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు పార్టీనుంచి వీరిని బహిష్కరించినట్లు రాష్ట్ర పార్టీ అధిష్టానం తెలిపింది.

Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల సమరం.. ఏడుగురు రెబల్స్‌పై వేటు వేసిన బీజేపీ..

Gujarat Election 2022

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆదివారం ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం గుజరాత్ లో ప్రచార పర్వంలో పాల్గొన్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో బీజేపీ నుంచి టికెట్ దక్కని ఏడుగురు రెబల్స్ గా నామినేషన్ వేసి బరిలో నిలిచారు. వీరిపై బీజేపీ వేటు వేసింది.

Gujarat Assembly Election 2022: డిసెంబరు 1, 5న గుజరాత్ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

గుజరాత్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తమ వ్యూహాలకు పదునుపెట్టింది. మోదీ, అమిత్ షాతో సహా అగ్రనేతలంతా ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ అధిష్టానం బీఫాం ఇవ్వలేదని కొందరు బీజేపీ నేతలు రెబల్స్ గా నామినేషన్ వేశారు. వారిని బుజ్జగించినప్పటికీ నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోవటంతో తిరుగుబాటుదారులపై బీజేపీ ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంది. పార్టీపై తిరుగుబాటు చేసిన ఏడుగురు నేతలను గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ బహిష్కరించారు.

Gujarat Elections: ఎన్నికల ముందు బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ మంత్రి

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారిలో మధు శ్రీవాస్తవ, అరవింద్ లడానీ, దిను పటేల్, హర్షద్ వాసవ, ధవల్ సింగ్ ఝాలా పేర్లు ఉన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు పార్టీనుంచి వీరిని బహిష్కరించినట్లు రాష్ట్ర పార్టీ అధిష్టానం తెలిపింది. టికెట్ రానివారిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అరవింద్ లడానీ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బుజ్జగించిన తరువాతకూడా ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. వాఘోడియా నుంచి బీజేపీ టికెట్‌పై ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధు శ్రీవాస్తవకు టికెట్ రాకపోవడంతో ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు.