గుజరాత్ కాంగ్రెస్ వెబ్‌సైట్ హ్యాక్

  • Published By: madhu ,Published On : March 16, 2019 / 08:09 AM IST
గుజరాత్ కాంగ్రెస్ వెబ్‌సైట్ హ్యాక్

పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొద్ది రోజులకే పార్టీ వెబ్ సైట్ హ్యాక్ కు గురికావడం కలకలం రేపుతోంది. గుజరాత్ కాంగ్రెస్ వెబ్‌సైట్‌ హ్యాక్ చేసిన దుండగులు అందులో హోమ్‌పేజ్‌లో హార్దిక పటేల్‌కి సంబంధించిన పాత ఫోటోలను పోస్ట్ చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హార్దిక పటేల్ అశ్లీల వీడియోలంటూ కొన్ని సిడిలు విడుదలైన సంగతి తెలిసిందే..అప్పటి ఆ వీడియోలను గుర్తు చేస్తూ..ఈ ఫోటోలను పోస్ట్ చేశారు హ్యాకర్లు. 

అందులో వెల్‌కమ్ టూ న్యూ లీడర్ అని రాసి ఉంది. వెబ్‌సైట్ హ్యాకింగ్ గురైన సమాచారం గుర్తించిన వెంటనే పార్టీ ఐటీ టీమ్ అప్రమత్తమైంది. హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌లోకి రావడం ఇష్టం లేని వారే ఈ పని చేసి ఉండొచ్చంటూ ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ సైబర్ సెల్‌కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.