Gujarat-Himachal Pradesh: ఓట్ల లెక్కింపు ముగింపు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. కాంగ్రెస్ పార్టీ 17, ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది.

Gujarat-Himachal Pradesh: ఓట్ల లెక్కింపు ముగింపు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

Gujarat-Himachal Pradesh: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. కాంగ్రెస్ పార్టీ 17, ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. గుజరాత్‌లో బీజేపీ విజయం సాధించడం ఇది ఏడోసారి. గుజరాత్ లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మరోసారి ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. ఇతరులకు 3 స్థానాలు దక్కగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 35. అంతకంటే ఎక్కువే కాంగ్రెస్ పార్టీ సాధించింది.

హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. కాగా, బీజేపీ కేవలం 1 శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో రాష్ట్రంలో ఓడిపోయిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తాను ఎన్నికల ఫలితాలను గౌరవిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ ముఖ్యమంత్రిని త్వరలో ఎన్నుకుని, రాష్ట్ర అభివృద్ధిని కృషి చేయాలని చెప్పుకొచ్చారు.

Gujarat Polls: గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పాత్రేంటి? కాంగ్రెస్ ఓటమితో బీజేపీ-బీ టీం అంటారా?