Ghost Harassment : సార్..నన్ను దెయ్యాలు చంపేస్తామంటున్నాయ్..రక్షించండీ

దెయ్యాలు నన్ను వేధిస్తున్నాయనీ..చంపేస్తామని బెదిరిస్తున్నాయని పోలీసులకు కంప్లైంట్ చేశాడు ఓ యువకుడు. దయచేసి నన్ను ఆ దెయ్యాల గుంపు నుంచి రక్షించండీ సార్..అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఏం చేయాలో అతనికి ఏం చెప్పాలో కూడా తెలియక తలలు పట్టుకున్నారు.

Ghost Harassment : సార్..నన్ను దెయ్యాలు చంపేస్తామంటున్నాయ్..రక్షించండీ

Ghost Harassment

Ghost Harassment : దెయ్యాలు. అసలు ఉన్నాయా? లేదా? అనేది పక్కనపెడితే..ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి భయాలు వారివి. అనుకోవటమే. సినిమాల్లో చూపిస్తున్నట్లుగా దెయ్యాలు మనుషులను ఆటపట్టిస్తాయా? వేధిస్తాయా? హింసిస్తాయా?. ఏమో..కానీ ఓ వ్యక్తి మాత్రం తనను దెయ్యాలు వేధిస్తున్నాయనీ..చంపేస్తామని బెదిరిస్తున్నాయని పోలీసులకు కంప్లైంట్ చేశాడు.దయచేసి నన్ను ఆ దెయ్యాల గుంపు నుంచి రక్షించండీ సార్..అంటూ వేడుకున్నాడు.సదరు వ్యక్తి ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఏం చేయాలో అతనికి ఏం చెప్పాలో కూడా తెలియక తలలు పట్టుకున్నవింత ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

గుజ‌రాత్‌లోని పంచ‌మ‌హల్ జిల్లా జామ్‌బూగోడా తాలుకాకు చెందిన బ‌రియా అనే 35 యువకుడు తనను దెయ్యాల గుంపు చంపేస్తామని బెదిరిస్తోందని వాటి వేధింపులు భరించలేకపోతున్నానంటూ పోలీసుల వద్ద వాపోయాడు. నేను నా పొలం వెళ్లగా..అక్క‌డ త‌న‌ను దెయ్యాలు వేధిస్తున్నాయ‌ని..ఆ దెయ్యాల గుంపులో రెండు దెయ్యాలు నన్ను చంపేస్తాయ‌ని బెదిరిస్తున్నాయ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. బ‌రియా మాట‌ల‌ను విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. పోలీసులే కాదు అతని మాటలు వింటే ఎవ్వరైనా అలాగే అవుతారు. పైగా నీకేమన్నా పిచ్చా అని కొట్టిపారేస్తారు.

కానీ పాపం బరియా చెప్పిన విధానానికి పోలీసులకు జాలి వేసింది. అతని ఫిర్యాదు గురించి బ‌రియా కుటుంబ స‌భ్యుల‌ను అడిగారు. దానికి వారు అతని మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేద‌ని తెలిపారు. సంవత్సరం నుంచి సైక్రియాటిస్ట్ వ‌ద్ద చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. కొన్ని రోజుల నుంచి అతని తీరు ఇలాగే ఉందని..అనుమానంతోను..భయంతోను ఉన్నాడని తాము ఎంతగా చెప్పినా తమను నమ్మటం లేదని ప‌ది రోజుల నుంచి మెడిసిన్స్ కూడా తీసుకోవట్లేదని తెలిపారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ..‘‘ తమ అనుమానం నిజమే అయ్యిందని కానీ అతనిని బాధపెట్టకూడదనే ఉద్ధేశ్యంతో కేసు నమోదుచేసుకున్నామని చెప్పామని..వాటి సంగతి మేం చూస్తాం..మీరు చికిత్స కోసం సైక్రియాటిస్ట్ వద్దకు వెళ్లమని నచ్చచెప్పి హాస్పిటల్ కు పంపించామని తెలిపారు.