West Bengal : భార్య చేసిన పనికి తుపాకీ, పెట్రోల్ బాంబులతో స్కూల్ క్లాస్‌రూమ్‌లో హల్‌చల్

తుపాకీ పట్టుకుని, పెట్రోల్ బాంబులు పట్టుకుని క్లాస్ రూమ్ లో చొరబడ్డాడో వ్యక్తి.పిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటు కూర్చుంటే న్యూస్ పేపర్ చదువుకుంటు బిల్డప్ ఇచ్చాడు.

West Bengal : భార్య చేసిన పనికి తుపాకీ, పెట్రోల్ బాంబులతో స్కూల్ క్లాస్‌రూమ్‌లో హల్‌చల్

Bengal school

West Bengal  : భార్య చేసిన పనికి తుపాకీ, పెట్రోల్ బాంబులతో స్కూల్ క్లాస్‌రూమ్ హల్‌చల్భార్య చేసిన పనికి ప్రస్టేషన్ కు గురి అయిన ఓ వ్యక్తి ఏకంగా తుపాకీ, పెట్రోల్ బాంబులతో స్కూల్ కు వచ్చాడు. పిల్లలున్న క్లాస్ రూమ్ లోకి వచ్చి వారిని నిర్భంధించటానికి యత్నించాడు. నా దగ్గర తుపాకీ ఉంది కదిలారంటే జాగ్రత్త అంటే అక్కడే ఉన్నాడు.దీంతో పిల్లలు హడలిపోయారు. ఏం చేయాలో తెలియక పిల్లలంతా భయాందోళనలకు గురి అయ్యారు. పశ్చిమబెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని ముచియా ఆంచల్‌ చంద్రమోహన్‌ హైస్కూల్‌లోకి తుపాకీతో వచ్చిన వ్యక్తి హంగామా క్రియేట్ చేశాడు.

తుపాకీ పట్టుకుని క్లాస్ రూమ్ లోనే నిలబడి తాపీగా న్యూస్ పేపర్ చదువుకుంటు నిలబడ్డాడు. ఏవిటేవిటో మాట్లాడాడు. పిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటు కూర్చున్నారు. ఇది గమనించిన స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటీన స్కూల్ కు వచ్చిన పోలీసులు సదరు వ్యక్తిని పట్టుకున్నారు. అతని నుంచి తుపాకీతోపాటు కొన్ని బాటిల్స్ స్వాధీనం చేసుకున్నాడు. ఆ బాటిల్స్ ను పెట్రోల్‌ బాంబులుగా గుర్తించారు.

ఎవరైనా అప్రమత్తమై పోలీసులకు పట్టిస్తారని కూడా సోయ లేకుండా అతను క్లాస్ రూమ్ లోనే ఉంటానికి కారణం అతని మానసిక స్థితి బాగాలేకపోవటం అని పోలీసులు గుర్తించారు. పోలీసులు అతనిని విచారణ చేయగా అతని పేరు దేబ్ వల్లబ్ అని అతనికి మతిస్థితిమితం లేదని తమ విచారణలో తేలిందని మాల్దా ఎస్సీ ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు.

విద్యార్ధులు ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన పనిలేదని తెలిపారు. కాగా సరదు వ్యక్తి భార్యకు విభేధాలున్నాయి. దీంతో తీవ్ర ప్రస్టేషన్ కు గురి అయి మతిస్థితిమితం కోల్పోయాడని తెలిపారు. దీంతో భార్యమీద ఉన్న కోపం కాస్త పిల్లలను బందీలుగా చేసుకోవాలని ప్రయత్నించాడని తెలిపారు.అతని భార్య.. తన కొడుకును తీసుకుని వెళ్లిపోయిందని అప్పటి నుంచి అతను మతిస్థిమితంలేకుండా ఉంటున్నాడని తేలింది. తనకు సమస్య గురించి సదరు వ్యక్తి పోలీసులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని ఎవ్వరు తనకు ఎటువంటి సహాయం చేయలేదని వాపోయాడు.