Assembly Elections 2023: 40% నేరస్థులు, 81% కోటీశ్వరులు, కొందరు నిరక్షరాస్యులు… ప్రస్తుత ఎమ్మెల్యేల జాతకం ఇది

పార్టీల వారీగా చూస్తే 129 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 107 మంది (83 శాతం), 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 76 మంది (78 శాతం), ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు.

Assembly Elections 2023: 40% నేరస్థులు, 81% కోటీశ్వరులు, కొందరు నిరక్షరాస్యులు… ప్రస్తుత ఎమ్మెల్యేల జాతకం ఇది

Madhya Pradesh Politics: మధ్యప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక అనేక షాకింగ్ విషయాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుత ఎమ్మెల్యేలలో 40 శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అంతే కాదు కోటీశ్వరులైన ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఈ నివేదికలో హైలెట్ అయింది.

ఏడీఆర్ నివేదిక ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుత 230 మంది ఎమ్మెల్యేలలో 93 మంది ఎమ్మెల్యేల(40 శాతం) మీద క్రిమినల్ కేసులు నమోదయ్యారు. మొత్తం సంఖ్యలో 20 శాతం మంది అంటే 47 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హత్యకేసులో ఒక ఎమ్మెల్యే ఉండగా, హత్యాయత్నం కేసులో ఆరుగురు ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు (వేధింపులకు) సంబంధించిన కేసులు ఇద్దరు ఎమ్మెల్యేలపై నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan Politics: నేను కుర్చీని వదులుకోవడానికి సిద్ధమే. కానీ.. సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు
చాలా మంది ఎమ్మెల్యేలపై కేసులు
పార్టీల వారీగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు కూడా నివేదికలో ప్రస్తావించారు. 129 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 39 మంది (30%), 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 52 మంది (54%), బీఎస్పీ ఎమ్మెల్యే ఒకరు (100%), ముగ్గురు స్వతంత్రులలో ఒకరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇదే కాకుండా.. పార్టీల వారీగా ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారు.

కోటీశ్వరులైన ఎమ్మెల్యేలు
ఏడీఆర్‌లో కోటీశ్వరుల ఎమ్మెల్యేల ప్రస్తావన కూడా వచ్చింది. నివేదిక ప్రకారం.. 230 మంది ఎమ్మెల్యేలలో 186 మంది అంటే దాదాపు 81 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. పార్టీల వారీగా చూస్తే 129 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 107 మంది (83 శాతం), 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 76 మంది (78 శాతం), ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. గణాంకాల ప్రకారం ప్రస్తుత ఎమ్మెల్యేలకు సగటు రూ.10 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: GST Evasion: 6000 ఫేక్ ఇన్‭పుట్ ట్యాక్స్ క్రెడిట్ కేసులు, రూ.57000 కోట్ల జీఎస్టీ ఎగవేత, 500 మంది అరెస్ట్

ఎమ్మెల్యేల అక్షరాస్యత
ప్రస్తుత ఎమ్మెల్యేలలో 33 శాతం మంది ఎమ్మెల్యేలు 5 నుంచి 12 వరకు చదువుకున్నారని, 64 శాతం మంది గ్రాడ్యుయేట్లు, నలుగురు ఎమ్మెల్యేలు డిప్లొమా హోల్డర్లు, 5 మంది ఎమ్మెల్యేలు అక్షరాస్యులు, ఒక ఎమ్మెల్యే నిరక్షరాస్యులు అని నివేదికలో పేర్కొన్నారు. 42 శాతం ఎమ్మెల్యేల వయసు 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండగా, 58 శాతం ఎమ్మెల్యేల వయసు 51 నుంచి 80 ఏళ్ల మధ్య ఉంది. ప్రస్తుతం 20 మంది మహిళలు ఎమ్మెల్యేలు ఉన్నారు.