Nurse Lost Hand : హ్యాట్సాఫ్.. భర్త చేయి నరికేసినా..తగ్గేదేలే.. ఎడమ చేతితో నర్స్ ప్రాక్టీస్

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య.. చేయి పోయినా తగ్గేదేలే అంటోంది. పోరాటం కొనసాగిస్తానంది. కుడి చేయి లేదని నిరాశ చెందకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే..(Nurse Lost Hand)

Nurse Lost Hand : హ్యాట్సాఫ్.. భర్త చేయి నరికేసినా..తగ్గేదేలే.. ఎడమ చేతితో నర్స్ ప్రాక్టీస్

Nurse Lost Hand

Nurse Lost Hand : భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని భర్త ఆమె చేయిని నరికేసిన ఘటన గుర్తుంది కదూ. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య.. చేయి పోయినా తగ్గేదేలే అంటోంది. ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పోరాటం కొనసాగిస్తానంది. మరింత పట్టుదలతో ముందుకు వెళ్తానంది. కుడి చేయి లేదని నిరాశ చెందకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఎడమ చేతితో రాయడం ప్రాక్టీస్ చేస్తోంది. కష్టపడి చదివి పరీక్షల్లో పాసై ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నానని, జాబ్ చేసి తీరతానని ఆమె తేల్చి చెప్పింది. ఆ మహిళ పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Man ChopsOff Wifes Hand : బాబోయ్.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని భార్య చేయి నరికేసిన భర్త

వెస్ట్ బెంగాల్ లోని కేతుగ్రామ్ గ్రామానికి చెందిన రేణు ఖాతున్(25) ఇటీవల ప్రభుత్వం ఆసుపత్రిలో నర్సు ఉద్యోగం సాధించింది. అయితే, ఉద్యోగం వస్తే తన భార్య తనను వదిలిపోతుందనే భయంతో భర్త షేర్ మహమ్మద్ దారుణానికి ఒడిగట్టాడు. ఎలాగైనా ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా చేయాలని నిర్ణయించుకున్న అతడు.. పదునైన ఆయుధంతో భార్య కుడి చేతిని నరికేశాడు.(Nurse Lost Hand)

Hand lost but not will to fight, West Bengal nurse practices using left arm

Hand lost but not will to fight, West Bengal nurse practices using left arm

Elon Musk: ఎలన్ మస్క్ పాలసీ నచ్చక మైక్రోసాఫ్ట్, అమెజాన్ వైపు చూస్తున్న టెస్లా ఉద్యోగులు

అసలేం జరిగిందంటే..

ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లాలోని కేతుగ్రామ్ గ్రామానికి చెందిన షేర్ మహహ్మద్, రేణు ఖాతున్ భార్యాభర్తలు. రేణు ఖాతున్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఇటీవలే పరీక్షల్లో పాసైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం సాధించింది. అయితే, భర్త షేర్ మహమ్మద్ కు ఇది ఇష్టం లేదు. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడం వల్ల ఆమె తనను విడిచిపెట్టి వెళ్లిపోతుందనే భయం అతడిని పట్టుకుంది. దాంతో అతడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరేందుకు అంగీకరించలేదు. జాబ్ లో చేరొద్దని ఆదేశించాడు. అయితే, భార్య మాత్రం భర్త మాట వినలేదు. జాబ్ లో జాయిన్ కావాలని డిసైడ్ అయింది.

తనను వదిలి వెళ్లిపోతుందనే భయంతో..

తన మాట కాదనడంతో భర్త కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా భార్య ఆ జాబ్ లో చేరకుండా చేయాలని నిర్ణయించుకున్న అతడు దారుణానికి ఒడిగట్టాడు. ఉన్మాదిలా వ్యవహరించాడు. ఓ పదునైన ఆయుధంతో భార్య చేయి నరికేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అంతేకాదు.. తెగిన చేయి భాగాన్ని అతడు దాచేశాడు. డాక్టర్లు తిరిగి అతికించకుండా ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. భార్య చేయి నరికిన భర్త.. రక్తమోడుతున్న భార్యను తనే స్వయంగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు ఆమె చేయిని కొంతభాగం తొలగించి వైద్యం చేశారు. ఆ తర్వాత భర్త షేర్ మహమ్మద్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు.

Man Quits Job: మూడున్నర కోట్ల జీతం.. బోర్ కొట్టి జాబ్‌కు రాజీనామా

ప్రభుత్వ ఉద్యోగం వల్ల తన భార్య తనను విడిచిపెట్టి పోతుందనే భయంతో ఆ భర్త చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ భర్తను అంతా తప్పుపడుతున్నారు. వాడసలు మనిషే కాదని తిట్టిపోస్తున్నారు. అతడి భయంలో అర్థం లేదంటున్నారు. వాడు మనిషి కాదు శాడిస్ట్ అని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw