సోనియా చచ్చిన ఎలుక…హర్యానా సీఎం క్షమాపణకు కాంగ్రెస్ డిమాండ్

  • Published By: venkaiahnaidu ,Published On : October 14, 2019 / 05:44 AM IST
సోనియా చచ్చిన ఎలుక…హర్యానా సీఎం క్షమాపణకు కాంగ్రెస్ డిమాండ్

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని చచ్చిన ఎలుకతో  పోల్చిన హర్యానా సీఎంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీఎం వెంటనే చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీజేపీ..మహిళల వ్యక్తిత్వానికి వ్యతిరేకమని చెప్పడానికి  సీఎం మనోహర్ లాల్ కట్టర్ చేసిన వ్యాఖ్యలే నిదర్శమని కాంగ్రెస్ విమర్శించింది.  బీజేపీ సీఎం చేసిన వ్యాఖ్యలు చాలా దిగజారుడుగా,అభ్యంతరకంగా మాత్రమే ఉండటమే కాకుండా బీజేపీ..మహిళల వ్యక్తిత్వానికి బీజేపీ వ్యతిరేకమని ఈ వ్యాఖ్యలను తెలియజేస్తున్నాయని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

ఆదివారం(అక్టోబర్-13,2019)హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ..లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటివ్యక్తి కాంగ్రెస్ పగ్గలు చేపడతారని చెప్పారు. రాహుల్ నిర్ణయాన్ని మేము కూడా స్వాగతించారు. వారసత్వ రాజకీయాలకు ముగింపు పడుతుందనుకున్నాం.

అయితే కొత్త ప్రెసిడెంట్ కోసం దేశమంతా వెతుకులాడిన కాంగ్రెస్ నాయకులు మూడు నెలల తర్వాత సోనియా గాంధీని కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నుకున్నారు. ఇదంతూ ఓ కొండను తవ్వి ఎలుకును పట్టినట్లు ఉంది. అది కూడా చచ్చిన ఎలుకను కాంగ్రెస్ నాయకులు పట్టుకున్నారంటూ ఖట్టర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370రద్దు తర్వాత  కశ్మీరీ యువతుల విషయంలో కూడా ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్-21,2019న ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 24,2019న ఫలితాలు వెలువడనున్నాయి.