Haryana: ఇంటికో బైక్, రూ.20కే లీటర్ పెట్రోల్, మూడు ఎయిర్‭పోర్టులు.. సర్పంచ్ ఎన్నికల్లో ఓ లీడర్ హామీలు

ఇంటికో బైక్ ఇస్తారట. అలాగే ఆ బైకులు నడవాలంటే పెట్రోల్ కావాలి. ఈరోజుల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో.. కేవలం 20 రూపాయలకే పెట్రోల్ ఇస్తానని అంటున్నారు. అంతే కాదండోయ్.. గ్రామంలో జీఎస్టీ వసూళ్లు కూడా ఉండవని చెబుతున్నారు. ఇక మహిళలకు ఉచిత మేకప్ కిట్లు, ప్రతిరోజు మన్ కీ బాత్, ఊర్లో మూడు ఎయిర్‭పోర్టులు, మందు తాగే వారికి రోజుకు ఒక బాటిల్, గ్రామం నుంచి ఢిల్లీ వరకు మెట్రోలైన్, ఉచిత వైఫై.. చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలానే ఉంది

Haryana: ఇంటికో బైక్, రూ.20కే లీటర్ పెట్రోల్, మూడు ఎయిర్‭పోర్టులు.. సర్పంచ్ ఎన్నికల్లో ఓ లీడర్ హామీలు

Haryana panchayat elections

Haryana: ఎన్నికలు అంటేనే ఇండియాలో ఓ విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఎన్నికల్లో గెలుపు కోసం.. నాయకులు ఇష్టారీతిన హామీలు ఇస్తుంటారు. అవి ఎలా ఉంటాయంటే ఏకంగా ఆకాశానికే నిచ్చెన వేస్తారు. సాధ్యాసాధ్యాల గురించి వారికి అనవసరం. గెలవకపోతే హామీలు చెల్లుబాటు కావు. ఒకవేళ గెలిచినా నాలుగు రోజులైతే ప్రజలు అవన్నీ మర్చిపోతారు. ఇదీ ఇక్కడి నాయకుల తీరు. అందుకే నోటికి ఎంతొస్తే అంత హామీలు ఇస్తుంటారు.

తాజాగా ఓ నాయకుడు ఇచ్చిన హామీలు కూడా ఇలాగే ఉన్నాయి. రూ.20కే లీటర్ పెట్రోల్.. ఇంటికో బైక్.. జీఎస్టీ రద్దు.. ఇదీ ఓ నాయకుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు. ఇంత పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ఇదేదో రాష్ట్ర ఎన్నికలు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. పంచాయతీ ఎన్నికల హామీలు ఇవి. హర్యానాలోని సిర్‭సాఢ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జయకరణ్ లఠ్వాల్ అనే నేత ఆ గ్రామస్థులకు ఈ రేంజులో హామీలు ఇస్తూ పోతున్నారు.

తనను సర్పంచ్‭గా గెలిపిస్తే.. ఇంటికో బైక్ ఇస్తారట. అలాగే ఆ బైకులు నడవాలంటే పెట్రోల్ కావాలి. ఈరోజుల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో.. కేవలం 20 రూపాయలకే పెట్రోల్ ఇస్తానని అంటున్నారు. అంతే కాదండోయ్.. గ్రామంలో జీఎస్టీ వసూళ్లు కూడా ఉండవని చెబుతున్నారు. ఇక మహిళలకు ఉచిత మేకప్ కిట్లు, ప్రతిరోజు మన్ కీ బాత్, ఊర్లో మూడు ఎయిర్‭పోర్టులు, మందు తాగే వారికి రోజుకు ఒక బాటిల్, గ్రామం నుంచి ఢిల్లీ వరకు మెట్రోలైన్, ఉచిత వైఫై.. చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలానే ఉంది. అదేదో సినిమా హైదరాబాద్‭లో ఓడరేపు పెట్టిస్తానని అన్నట్లు హామీలు ఇస్తున్నారు.

Sena vs Sena: శివసేన రెండు గ్రూపులకు పేర్లు కేటాయించిన ఎన్నికల సంఘం