భార్య బర్త్‌డే, ఢిల్లీలో రైతులకు కటింగ్, షేవింగ్ చేస్తున్న సెలూన్ యజమాని

10TV Telugu News

Haryana salon owner skips Canada trip : ప్రతి ఏడాది భార్య పుట్టిన రోజును ఎంతో సంబరంగా జరుపుకొనే ఆ వ్యక్తి..ఈసారి మాత్రం రైతుల మధ్య ఉన్నాడు. దేశ రాజధానిలో కదం తొక్కుతున్న రైతులకు అండగా, మద్దతు పలుకుతున్నాడు. ఇంతకు ఆయన ఏం చేస్తున్నాడు అనేగా మీ డౌట్. ఆందోళనలు, నిరసనల్లో పాల్గొంటున్న రైతులకు గడ్డాలు, కటింగ్ చేస్తున్నాడు. దీనికి వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఢిల్లీ రాష్ట్రంలోని సింఘూ బోర్డర్ (Singhu border) వద్ద ఓ ట్రక్కుకు ‘Crazy Beauty Salon’ పేరిట బ్యానర్ ఏర్పాటు చేసి..ఉచితంగా సేవలందిస్తున్నాడు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి వెళ్లే సరిహద్దుల వద్ద పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు ఆందోళన చేపడుతున్నారు. సింఘూ సరిహద్దు వద్ద quick shave, a head massage, dye aging white hair, face massage ఇవన్నీ ఉచితంగానే చేయనున్నట్లు బ్యానర్ Labh Singh Thakur బ్యానర్ ఏర్పాటు చేశాడు. సెలూన్ చిరునామ Pehwa in Kurukshetraగా రాసి ఉంది. కస్టమర్ల కోసం మూడు కుర్చీలను ఏర్పాటు చేశాడు. ఇతను చేస్తున్న సేవలు మీడియా దృష్టిని ఆకర్షించింది.

తన భార్యతో Kurukshetraలో సెలూన్ పార్లర్ నడుపుతున్నట్లు, ఇక్కడకు వచ్చే కస్టమర్లలో అధికశాతం రైతులే ఉంటారని Labh Singh Thakur వెల్లడించారు. సింఘూ సరిహద్దు వద్ద రైతులు నిరసనలు తెలియచేస్తుండడం కదిలించి వేసిందని, వారికి తమ సేవలు అవసరమని భావించి తన బృందంతో ఇక్కడకు చేరుకోవడం జరిగిందన్నారు. రోజుకు సుమారు 100 నుంచి 150 మందికి కటింగ్ చేస్తున్నామన్నారు. దీనికోసం ఏమి డబ్బులు వసూలు చేయడం లేదని, ఎవరైనా డబ్బులు చెల్లించేందుకు ముందుకు వచ్చినా..తాము సున్నితంగా నిరాకరించడం జరుగుతోందన్నారు. రైతులకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని, కానీ..ఏదో లోపం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎంతో ఘనంగా భార్య పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండడమే.

Delhi

సెలూన్ నడుపడంలో తన భార్య ఎంతో సహాయం చేసిందని, దుకాణానికి వచ్చే వారికి టీ అందిస్తుందని తెలిపారు. కానీ..ఆమె పుట్టిన రోజును జరిపించడం లేదని, ప్రతి సంవత్సరం విదేశాల్లో జరుపుకొనే వారమన్నారు. ఈసారి కెనాడను సందర్శించుకోవాలని అనుకున్నట్లు వెల్లడించారు. అయితే..ప్రస్తుతం దానిని రద్దు చేసుకుని…సింఘూ సరిహద్దు వద్ద రైతులకు సేవ చేస్తున్నట్లు Labh Singh Thakur తెలిపారు. తన బృందం దాదాపు 15 గంటల పాటు పని చేస్తుందని, గత రెండు వారాలుగా ఈ పని చేస్తున్నామన్నారు. Labh Singh Thakur చేస్తున్న సేవలను పలువురు రైతులు కొనియాడారు. ఈ సౌకర్యం ఇక్కడ లేకపోతే..తాము దూరంగా ఉండే..గ్రామాలకు వెళ్లాల్సి వచ్చేదని Crazy Salon రైతు తెలిపారు. తమ పిల్లలు కూడా వరుసలో నిల్చొంటారన్నారు. గత మూడు రోజులుగా సెలూన్‌‌కు వస్తున్నానని, కానీ చాలా మంది లైన్‌‌లో వేచి ఉండడంతో తనవంతు ఇంకా రాలేదని Aman తెలిపారు.

×