Prophet Row: యూపీ సీఎం.. అలహాబాద్ న్యాయమూర్తి అయ్యారా – ఒవైసీ
యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ పై ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లు చేశారు. జూన్ 10 ఆందోళనలకు కారణమైన జావేద్ అహ్మద్ ఇల్లు పడగొట్టించడంపై విమర్శలు గుప్పించారు.

Prophet Row: యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ పై ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లు చేశారు. జూన్ 10 ఆందోళనలకు కారణమైన జావేద్ అహ్మద్ ఇల్లు పడగొట్టించడంపై విమర్శలు గుప్పించారు. యూపీ సీఎం యోగి.. అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏమైనా అయ్యారా అంటూ ప్రశ్నలు సంధించారు.
“యూపీ సీఎం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారా.. అతనెవరినైనా దోషిగా నిర్ధారించి ఇళ్లను కూల్చేస్తారా? కూల్చివేసిన ఇల్లు ముస్లిం మహిళ అయిన నిందితుడి భార్య పేరు మీద ఉంది” అని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్ కూడా ఆదివారం కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. ఆ ఇల్లు అహ్మద్ కూతురైన మాజీ జేఎన్‌యూ విద్యార్థి అఫ్రీన్ ఫాతిమాకు చెందినదని వారు పేర్కొన్నారు.
Read Also: నుపూర్ శర్మను అరెస్టు చేయాల్సిందే: అసదుద్దీన్ ఒవైసీ
ఏజెన్సీ అధికారి ప్రకారం, నిందితుడు జావేద్ అహ్మద్ ఇంటి బిల్డింగ్ మ్యాప్‌ను PDA ఆమోదించలేదు. శుక్రవారం రాళ్లు రువ్విన సహరన్‌పూర్‌లో అల్లర్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తుల అక్రమ ఆస్తులను బుల్‌డోజర్‌తో కూల్చివేశారు.
“జావేద్ అహ్మద్ ఇల్లు, జెకె అషియానా ప్రయాగ్‌రాజ్‌లోని కరేలీ ప్రాంతంలో ఉంది. పోలీసు సిబ్బంది, జేసీబీ మెషీన్ ఉదయం 10గంటల 30 నిమిషాలకు కరేలీ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కూల్చివేత మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభించాం” అని పీడీఏ సీనియర్ అధికారి తెలిపారు.
పోలీసులు కూడా ఇంట్లో సోదాలు జరిపి పలు అభ్యంతరకర వస్తువులను స్వాధీనపరుచుకున్నారు. ఇంటి నుంచి రెండు దేశీయ పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.