Heavy Rains in Bengaluru: బెంగళూరులో భారీ వర్షాలు.. నీట మునిగిన రోడ్లు.. పడవలు ఏర్పాటు చేసిన అధికారులు

కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ అయితే, మొత్తం నీటితో నిండిపోయింది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిని అధికారులు రక్షిస్తున్నారు.

Heavy Rains in Bengaluru: బెంగళూరులో భారీ వర్షాలు.. నీట మునిగిన రోడ్లు.. పడవలు ఏర్పాటు చేసిన అధికారులు

Heavy Rains in Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఐటీ కారిడార్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అనేక కాలనీల్లోకి నీళ్లు చేరాయి.

Viral video: భయానక వీడియో.. కిందికి జారిపడ్డ జెయింట్ స్వింగ్.. 16 మందికి గాయాలు

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆదుకోమంటూ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు బోట్లు ఏర్పాటు చేశారు. బోట్లలో ప్రజల్ని సహాయక కేంద్రాలకు తరలిస్తున్నారు. వార్తర్ రోడ్డుతోపాటు బెల్లాందుర్, సార్జాపుర రోడ్డు, వైట్ ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎమ్ఎల్ లేఔట్ వంటి ఏరియాలు పూర్తిగా నీట మునిగాయి. నగర శివారులోని ఇలాంటి ప్రాంతాల్లోని వర్షపు నీరు వరద ప్రవాహాన్ని తలపిస్తోంది. చాలా చోట్ల వీధులు పూర్తిగా నీటితో నిండిపోయాయి.

Tamil Nadu: పొదల్లో శిశువు మృతదేహం.. స్కూల్లోనే ప్రసవించి, వదిలేసిన బాలిక

వర్షాల వల్ల నగరంలోని ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నెల 9 వరకు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బీదర్, కళాబురాగి, విజయపుర, గాడగ్, ధార్వాడ్, హవేరి, దేవనగరె వంటి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. శివారు ప్రాంతాల్లోని ఆక్రమణల వల్లే ఆ ప్రాంతాలు నీట మునిగాయని అధికారులు అంటున్నారు.