Herbal Face Mask : వావ్..బాబాగారి హెర్బల్ మాస్క్…ధరిస్తే.. కరోనా ఆమడదూరం పారిపోతుందట..

ఈ కరోనా రోజుల్లో రకరకాల మాస్కుల్ని చూసి ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ సాధువు పెట్టుకున్న మాస్క్ ను బహుశా ఎక్కడా చూసి ఉండరు. కలర్ ఫుల్ తో మార్కెట్లో ఫేస్ మాస్కులు కనిపిస్తున్నీ ఈ కరోనా సమయంలో యూపీలోని ఓ బాబా మాత్రం ఖరీదైన మాస్కులు పెట్టుకుంటే కరోనా రాదనే గ్యారంటీ ఏమన్నా ఉందా? అని ప్రశ్నిస్తున్నాడు. పైగా ప్రకృతి సిద్ధంగా తయారైన వనమూలిక మాస్కు పెట్టుకుంటే కరోనా మహమ్మారే కాదు ఏ వైరస్ దగ్గరకే రాదంటున్నాడు.

Herbal Face Mask : వావ్..బాబాగారి హెర్బల్ మాస్క్…ధరిస్తే.. కరోనా ఆమడదూరం పారిపోతుందట..

Herbal Face Mask

Herbal Face Mask for covid 16 Security : ఈ కరోనా రోజుల్లో రకరకాల మాస్కుల్ని చూసి ఉంటారు. వజ్రాల మాస్కులను కూడా చూశాం. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ సాధువు పెట్టుకున్న మాస్క్ లాంటిది మాత్రం బహుశా ఎక్కడా చూస ఉండరు. కలర్ ఫుల్ తో మార్కెట్లో ఫేస్ మాస్కులు కనిపిస్తున్నీ ఈ సమయంలో యూపీలోని ఓ బాబా మాత్రం ఖరీదైన మాస్కులు పెట్టుకుంటే కరోనా రాదనే గ్యారంటీ ఏమన్నా ఉందా? అని ప్రశ్నిస్తున్నాడు. పైగా ప్రకృతి సిద్ధంగా తయారైన వనమూలిక మాస్కు పెట్టుకుంటే కరోనా మహమ్మారే కాదు ఏ వైరస్ దగ్గరకే రాదంటున్నాడు.

72 ఏళ్ళ ఈ బాబా మూలికలతో తయారు చేసిన వెరైటీ మాస్క్ ధరించి అందర్నీ ఆకర్షిస్తున్నాడు. నిమ్మ (Lemon) చెట్టు ఆకులు, తులసి (Tulasi) ఆకులతో పాటు మరికొన్ని వన మూలికలతో కలిపి తయారు చేసిన ఈ మాస్కు పెట్టుకుంటే కరోనా మీ చెంతనే రాదు అంటున్నాడుజ ఈ వనమూలికల మాస్కు కోవిడ్ నుంచి రక్షిస్తుందని.. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని అంటున్నాడు. ఈ ఆకుల్లో ఉండే గుణాలు ఎటువంటి అనారోగ్యాన్ని దరిచేరనివ్వవని చెబుతున్నాడు.

యూపీలోని సీతాపూర్ పరిసరాల్లో సంచరించే ఈ సాధువుని స్థానికులు జుగాడి బాబా అని పిలుస్తుంటారు. వనమూలికలు మన ఆయుర్వేదంలో అంతర్భాగమని..ఎన్నో ఏళ్ళ నాటి వైద్య సంబంధ ప్రక్రియ అని..ప్రతివారూ ఇటువంటి మూలికల మాస్క్ ధరిస్తే మంచిదని సూచిస్తున్నాడు. ఈ మాస్కుని కూడా రెండు మూడు రోజులకొకసారి మార్ఛుకోవాలని చెబుతున్నాడు జుగాడి బాబా.సీతాపూర్ జిల్లాలో ఈ బాబా మూలికా మాస్క్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆ అన్నట్లు ఈయన సాధువు కాబట్టి వివాహం కాలేదని అనుకోవద్దు.
ఈయనకు ఓ కుటుంబం కూడా ఉంది. తమ కుటుంబం కూడా ఇటువంటి మూలికల మాస్కులనే ధరిస్తోందని అంటున్నాడు.