CORDYCEPS : హిమాలయన్ గోల్డ్.. ‘కార్డిసెప్స్’ మార్కెట్ విలువ రూ. 9,000 కోట్లు…వాటి కోసమే భారత్‌పై చైనా కన్ను
హిమాలయన్ గోల్డ్..హిమాలయన్ వయాగ్రా, హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే అత్యంత అరుదైన ఖరీదైన కార్డిసెప్స్’ కోసం చైనా భారత్ పై కన్నేసింది. ఈ హిమాలయన్ గోల్డ్ గా పిలిసే ఈ వనమూలికలు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగా దాని మార్కెట్ విలువ రూ. 9,000 కోట్లు...వాటి కోసమే భారత్‌పై చైనా కన్నుపడింది.

'Himalayan Viagra' CORDYCEPS (1)
‘Himalayan Viagra’ CORDYCEPS : చైనా.. దేనికోసం భారత సరిహద్దుల్లో పదే పదే చొరబాటుకు ప్రయత్నిస్తోంది? తవాంగ్ సెక్టార్లో ఘర్షణ వెనుక వ్యూహమేంటి? ఇలా.. చాలా ప్రశ్నలు భారతీయుల్లో మెదులుతున్నాయ్. కానీ.. చైనా చొరబాట్ల వెనుక భారీ ప్లాన్ ఉందని చెబుతోంది ఇండో పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్. డ్రాగన్ ఆర్మీ టార్గెట్ భారత భూభాగం కాదు. దాని కన్ను భారత్ భూభాగంలో లభ్యమయ్యే అత్యంత విలువైన వనమూలికలపై పడింది. వాటిని దక్కించుకోవటానికి చొరబాట్లకు పాల్పడుతోంది. అది బంగారం కంటే విలువైన ఓ ఆయుర్వేద ఔషధం. ఆ ఆయుర్వేద ఔషధం ఏంటి..? దానికోసం చైనా ఎందుకింత ఆరాటపడుతోంది…?
హిమాలయన్ గోల్డ్..హిమాలయన్ వయాగ్రా, హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే అత్యంత అరుదైన ఖరీదైన కార్డిసెప్స్’ కోసం చైనా భారత్ పై కన్నేసింది. ఈ హిమాలయన్ గోల్డ్ గా పిలిసే ఈ వనమూలికలు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగా దాని మార్కెట్ విలువ రూ. 9,000 కోట్లు…వాటి కోసమే భారత్‌పై చైనా కన్నుపడింది. రెండున్నరేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో చైనా ఉద్రిక్తత సృష్టించింది. సరిహద్దుల్లో అప్పుడు మొదలైన ప్రతిష్టంభన.. కొన్ని నెలల క్రితమే ఓ కొలిక్కి వచ్చింది. బోర్డర్లో పరిస్థితులు చల్లబడ్డాయనుకుంటున్న తరుణంలోనే.. తాజాగా అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్లో మరోసారి చొరబాటుకు ప్రయత్నించింది డ్రాగన్ ఆర్మీ. రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ కూడా జరిగింది. భారత బలగాలు.. చైనా సేనలను దీటుగా ఎదుర్కోవడంతో.. డ్రాగన్ ఆర్మీ తోకముడిచింది. అయితే.. ఇదంతా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖను మార్చేందుకే.. చైనా ఇలా చేస్తోందనే వాదనలు వచ్చాయ్. తవాంగ్ సెక్టార్ చైనాకు వ్యూహాత్మక ప్రాంతంగా మారుతుందనే ఉద్దేశంతోనే.. అక్కడ ఉద్రిక్తతలు సృష్టించిందనే విశ్లేషణలు వినిపించాయ్. కానీ.. సరిహద్దుల్లో చైనా సేనలు పదే పదే చొరబాటుకు ప్రయత్నించడం వెనుక ఆసక్తికర కారణంలో వెలుగులోకి వచ్చింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో దొరికే అరుదైన ఔషధం కోసమే.. భారత్‌లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
తవాంగ్ సెక్టార్‌లోకి చైనా బలగాలు చొచ్చుకు రావడానికి కారణమేంటనేది ఆరా తీస్తే.. హిమాలయాల్లో లభించే బంగారం కంటే విలువైన ఓ ఔషధం కోసమే చైనా సైనికులు చొరబడుతున్నారని చెబుతున్నారు. అరుణాచల్‌లోని భారత భూభాగంలోకి.. చైనా సేనలు పదే పదే దాని కోసే చొరబడుతున్నారని.. ఇండో-పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్.. IPCSC సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్కి.. చైనాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. దీన్ని స్థానికంగా కీడా జాడి అని పిలుస్తారు. హిమాలయన్ గోల్డ్‌గా దీనికి చాలా పేరుంది. అరుదుగా లభించే ఈ కార్డిసెప్స్‌లో.. అద్భుతమైన ఔషధ గుణాలుంటాయ్. పసుపు, కాషాయ వర్ణంలో సన్నని పోగులా ఉండే వీటిని.. సూపర్ మష్రూమ్స్‌గా పిలుస్తారు. గొంగలి పురుగు తరహాలో చూడడానికి ఇది కనిపిస్తుంది. అత్యంత ఖరీదైన ఈ కార్డిసెప్స్ ధర బంగారం కంటే ఎక్కువే. 10 గ్రాముల కార్డిసెప్స్ ధర సుమారు 700 డాలర్లు. అంటే.. మన కరెన్సీలో 56 వేలు. అదే.. వంద గ్రాములైతే.. 5 లక్షల 60 వేలు. అదే.. కేజీ అయితే.. 56 లక్షలు. ఇక.. మంచి క్వాలిటీ ఉన్న కార్డిసెప్స్.. ఇంకా ఎక్కువ ధరే పలుకుతుంది.
భారత్‌లోని హిమాలయ ప్రాంతంతో పాటు చైనాలోని కింగై, టిబెట్ లాంటి ఎత్తైన ప్రదేశాల్లో ఈ కీడా జాడి ఎక్కువగా కనిపిస్తుంటాయి. తాజా రిపోర్ట్ ప్రకారం.. చైనాతో పాటు అంతర్జాతీయంగా కార్డిసెప్స్ మార్కెట్ విలువ 1072 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే.. మన కరెన్సీలో దాదాపు 9 వేల కోట్లు. వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో.. చైనాదే అగ్రస్థానం. అయితే.. అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కింగై ప్రాంతంలో రెండేళ్లుగా వీటి సాగు తగ్గిపోయింది. ఇదే సమయంలో.. పదేళ్లుగా వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల.. వీటిని వెతుక్కుంటూనే అరుణాచల్ సరిహద్దుల్లోకి చైనా సైనికులు చొరబడినట్లు.. ఐపీసీఎస్సీ తన రిపోర్టులో తెలిపింది.
2010లో చైనాలో కీడాజాడి ఉత్పత్తి లక్షన్నర కిలోలుండగా.. 2018కి వచ్చే నాటికి 41 వేల 200 కిలోలకు పడిపోయింది. గడిచిన రెండేళ్లలో మరింత క్షీణించింది. ఎలాంటి రోగాన్నైనా నయం చేసే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ కీడా జాడి.. కేవలం హిమాలయాల్లోనే దొరుకుతాయ్. క్యాన్సర్ కణాలను అడ్డుకొనే శక్తి కూడా ఉందులో ఉందని చైనీస్ భావిస్తున్నారు. అందుకే.. బంగారం కంటే దీనికి విలువ ఎక్కువ. ఇవి.. అతిశీతల వాతావరణం ఉన్న చోటే సాగవుతాయి. అలాంటి వాతావరణం హిమాలయాలు, టిబెట్ పీఠభూమిలో ఉంది. అందువల్ల.. అక్కడే ఎక్కువగా కనిపిస్తున్నాయ్. ఇప్పుడు.. చైనా వైపు కీడా జాడి సాగు తగ్గిపోవడంతో.. వారి కళ్లు భారత్ భూభాగంలో ఉన్న హిమాలయా ప్రాంతాలపై పడ్డాయ్.
హిమాలయాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు.. ఈ కీడా జాడిని సేకరించి.. వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నారు. టిబెట్ పీఠభూమితో పాటు హిమాలయ ప్రాంతాల్లోని 80 శాతం మంది వీటి అమ్మకం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. చైనాలోని కొన్ని ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు కూడా కింగై ప్రాంతానికి చెందిన వారికి కోట్లలో చెల్లించి.. కీడాజాడి సాగయ్యే కొండ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయ్. పరిమిత వనరులు, ఎక్కువ డిమాండ్ కలిగి ఉండటంతో.. వీలైనంత ఎక్కువగా కీడా జాడిని సాగు చేస్తూ వచ్చింది చైనా. దీని కారణంగా.. ప్రతి ఏటా కార్డిసెప్స్ దిగుబడి పడిపోతూ వచ్చిందని సర్వేలు చెబుతున్నాయి. ఔషధ గుణాలు కలిగిన కార్డిసెప్స్పై.. అస్సాంలోని బోడో యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఎనిమిదేళ్లుగా రీసెర్చ్ చేస్తున్నారు. ప్రయోగశాలలో.. నియంత్రిత వాతావరణంలో వీటిని సాగు చేస్తున్నారు. మైనస్ 86 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఆరబెట్టి, పోషక, ఔషధ గుణాలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారు.