రేపటి నుంచి వరుసగా 4 రోజులు సెలవులు

బ్యాంకు ఖాతాదారులకు గమనిక. దేశవ్యాప్తంగా రేపటి(మార్చి 13,2021) నుంచి బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. రేపు(మార్చి 13,2021) రెండో శనివారం కాగా..ఎల్లుండి(మార్చి 14,2021) ఆదివారం సెలవులు ఉండనున్నాయి.

రేపటి నుంచి వరుసగా 4 రోజులు సెలవులు

holidays for banks: బ్యాంకు ఖాతాదారులకు గమనిక. దేశవ్యాప్తంగా రేపటి(మార్చి 13,2021) నుంచి బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. రేపు(మార్చి 13,2021) రెండో శనివారం కాగా..ఎల్లుండి(మార్చి 14,2021) ఆదివారం సెలవులు ఉండనున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అంటే మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. దీంతో మార్చి 13 నుంచి మార్చి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండో శనివారాలు, 4 ఆదివారాలతో కలిసి మొత్తం మార్చి నెలలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో ఖాతాదారులు తమ పనులను అందుకు అనుగుణంగా షెడ్యూల్ చేసుకోవడం మంచిది.