Amit Shah: హోంమంత్రిగా తనకు తానే మార్కులు వేసుకున్న అమిత్ షా.. అయితే అవి నంబర్లలో కాదు

ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించాం. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తివ్రవాదాన్ని అణచివేసి చాలా ప్రాంతాల్లో కేంద్రం పెట్టిన ఆంక్షల్ని ఎత్తివేశాం. ఇక బిహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో తీవ్ర వామపక్ష వాదం నశించింది. ఇప్పుడు ఆ రాష్ట్రాలు ప్రశాంతగా ఉన్నాయి

Amit Shah: హోంమంత్రిగా తనకు తానే మార్కులు వేసుకున్న అమిత్ షా.. అయితే అవి నంబర్లలో కాదు

How does Amit Shah rate himself as home minister? Here's what he said

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. హోంమంత్రిగా తాను సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన కాన్‭క్లేవ్‭కు ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా హోంమంత్రిగా తనకు తాను ఎన్ని మార్కులు వేసుకుంటారంటూ ప్రశ్నించగా.. నంబర్లు లేకుండా మార్కులు వేసుకున్నారు. దేశంలోని మూడు సమస్యాత్మక ప్రాంతాల్ని తన హయాంలో మార్చడాన్ని ఉత్తమంగా ఆయన ప్రకటించుకున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఆ ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారం చూపలేకపోయాయని, కానీ మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అమిత్ షా అన్నారు.

Kerala: రూ.75 లక్షల లాటరీ గెలిచిన ఆనందంలో.. పోలీస్ స్టేషన్‭‭కు పరుగులు తీసిన వలస కార్మికుడు

కశ్మీర్, ఈశాన్యం ప్రాంతాలతో పాటు.. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వామపక్షవాదాలను మూడు సమస్యాత్మకమైనవిగా అమిత్ షా పేర్కొన్నారు. ‘‘ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించాం. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తివ్రవాదాన్ని అణచివేసి చాలా ప్రాంతాల్లో కేంద్రం పెట్టిన ఆంక్షల్ని ఎత్తివేశాం. ఇక బిహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో తీవ్ర వామపక్ష వాదం నశించింది. ఇప్పుడు ఆ రాష్ట్రాలు ప్రశాంతగా ఉన్నాయి’’ అని అన్నారు. ఇక ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాలోని నాలుగు జిల్లాల్లో ఉన్న నక్సలిజాన్ని కూడా భద్రతా బలగాలు తొందర్లో తుద ముట్టిస్తాయని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

Ram Temple: అయోధ్యలో శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు.. గర్భగుడి తొలి ఫొటో వైరల్

అంతర్గత భద్రతలో భారత్ గణనీయమైన వృద్ధి సాధించిందని, అదే తన పనితీరుకు మార్కులని అమిత్ షా అన్నారు. తమ చర్యల వల్ల ఈశాన్య ప్రాంతంలోని అనేక మంది యువత స్వచ్ఛందంగా లొంగిపోయి, ఆయుధాలను సరెండర్ చేసినట్లు తెలిపారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు ఇతర అభివృద్ధిని మెరుగు పరిచినట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో చేపట్టిన రైలు, విమాన ప్రాజెక్టులు 2024లోపు పూర్తవుతాయని అన్నారు. ఇండియాను ప్రపంచంలో నెంబర్ వన్ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, 2024 ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని అమిత్ షా అన్నారు.