నేషన్ హీరో అభినందన్ : ప్రాణాలను పణంగా పెట్టి సాహసం

సస్సెన్స్ వీడింది. టెన్షన్ తొలగింది. భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. దేశ ప్రజల ప్రార్థనలు ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్థమాన్

  • Published By: veegamteam ,Published On : February 28, 2019 / 03:09 PM IST
నేషన్ హీరో అభినందన్ : ప్రాణాలను పణంగా పెట్టి సాహసం

సస్సెన్స్ వీడింది. టెన్షన్ తొలగింది. భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. దేశ ప్రజల ప్రార్థనలు ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్థమాన్

సస్సెన్స్ వీడింది. టెన్షన్ తొలగింది. భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. దేశ ప్రజల ప్రార్థనలు ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్థమాన్ విడుదలకు పాకిస్తాన్ అంగీకరించింది. రేపు(శుక్రవారం మార్చి 1) అభినందన్‌ను విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఆ దేశ పార్లమెంటులో ప్రకటించారు. భారత్‌తో శాంతి కోరుకుంటున్నామని చెప్పారు.

అసలు అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి ఎలా చిక్కారు? వారి భూభాగంలో ఎలా ల్యాండ్ అయ్యారు? ఆ తర్వాత ఏం జరిగింది? భారత ఆయుధాగారాన్ని ఎలా కాపాడారు? బుధవారం ఫిబ్రవరి 27 ఉదయం పాకిస్తాన్ యుద్ధ విమానాలు మన భూభాగంలోకి చొరబడ్డాయి. భారత ఆయుధాగారాన్ని టార్గెట్ చేసి దాడికి యత్నించాయి. వారి నుంచి ఆయుధాగారాన్ని కాపాడే ప్రయత్నంలో భారత వాయుసేన పైలట్‌ అభినందన్‌ వీరోచిత పోరాటం చేశారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆర్మీ బ్రిగేడ్‌ కేంద్ర కార్యాలయాన్ని కాపాడటమే లక్ష్యంగా రంగంలో దిగిన అభినందన్‌ అనుకున్నదైతే సాధించారు. ఘటన సమయంలో మిగ్‌-21 బైసన్‌ విమానంలో ఉన్న అభినందన్‌…పాకిస్తాన్‌ ఎఫ్‌-16 విమానాన్ని వెంబడించి కూల్చేశారు. ఈ క్రమంలోనే ఆయన శత్రు విమానంతో పాటు సరిహద్దులు దాటి…పాక్ సైన్యానికి చిక్కారు.

ఎఫ్‌-16 విమానాన్ని కూల్చే ప్రయత్నంలోనే అభినందన్‌ విమానం కూడా అదుపుతప్పి కూలిపోయింది. దీంతో వెంటనే అభినందన్‌ పారాచ్యూట్‌తో సురక్షితంగా… పీవోకేలోని ఓ నదీ పరీవాహక  ప్రదేశంలో కిందికి దిగారు. అయితే మిగ్‌ కూలిపోవడాన్ని గమనించిన పాక్‌ సైనికులు సంఘటన స్థలానికి చేరుకుని…అభినందన్‌ను పట్టుకున్నారు. అనంతరంపై ఆయన దాడి చేసి తీవ్రంగా  గాయపరిచి…సమీపంలోని సైనిక శిబిరానికి తీసుకెళ్లారు.

జమ్ముకశ్మీర్‌లోని బ్రిగేడ్‌ కేంద్ర కార్యాలయాన్ని దెబ్బతీస్తే భారత్‌ సైన్యానికి ఉన్నత స్థాయిలో భారీ ప్రాణనష్టం జరుగుతుంది. భారత్‌ పూర్తి స్థాయి యుద్ధానికి దిగక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.  అందుకే, వీటిని టార్గెట్‌ చేసుకుని పాకిస్థాన్‌కు చెందిన 10 ఎఫ్‌-16 విమానాలు సరిహద్దులు దాటుకొని భారత భూభాగంలోకి వచ్చాయి. పాక్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచిన విషయాన్ని  క్షణాల్లోనే భారతీయ రాడార్లు పసిగట్టాయి. వెంటనే భారత్‌కు చెందిన 4 సుఖోయ్‌, 2 మిగ్‌ విమానాలు నింగిలోకి దూసుకెళ్లాయి. 16 విమానాల మధ్య ఆకాశంలో హోరాహోరీ  పోరాటం జరిగింది. అభినందన్‌ తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ సాహసం చేసి ఉండకపోతే పాక్‌ విమాన దాడిలో మనకు భారీ నష్టం జరిగేదని భారత వాయుసేన వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్‌ చెర నుంచి విడుదల కానున్న అభినందన్‌ది అసాధారణమైన పోరాటమనే చెప్పాలి.

భారత్‌ ఒత్తిడికి పాకిస్తాన్‌ తలొగ్గింది. భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ వర్థమాన్‌ను పాక్‌ చెర నుండి విడిపించడానికి అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిగా చేస్తూ ఒత్తిడి చేయడంలో  భారత్‌ పైచేయి సాధించింది. విక్రమ్‌ అభినందన్‌ను రేపు(మార్చి 1) విడుదల చేస్తామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదరలేదని పేర్కొన్నారు. శాంతి చర్యల్లో భాగంగా అభినందన్‌ను విడుదల చేస్తామని ఇమ్రాన్ తెలిపారు.