Salary Increases: వచ్చే ఏడాది వేతనాలు ఎలా ఉంటాయి? ద్రవ్యోల్బణం ప్రభావం ఎంత? ఇండియా పరిస్థితి ఏంటి?

ఇప్పటికే ప్రపంచాన్ని కుదిపేస్తున్న ద్రవ్యోల్బణ ప్రభావం వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది. అయితే, దీని ప్రభావం వేతనాల పెరుగుదలపై అధికంగా ఉండే అవకాశం ఉంది. ఐరోపా, అమెరికాలో వేతనాల పెరుగుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది.

Salary Increases: వచ్చే ఏడాది వేతనాలు ఎలా ఉంటాయి? ద్రవ్యోల్బణం ప్రభావం ఎంత? ఇండియా పరిస్థితి ఏంటి?

Salary Increases: ప్రస్తుతం ఇండియాతోపాటు అనేక దేశాలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వివిధ రంగాల్లో ఉద్యోగుల వేతనాలు ఎలా ఉంటాయి అనే సందేహం మొదలైంది. వచ్చే ఏడాది వేతనాలు పెరుగుతాయా? లేక తగ్గుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. అందుకే ఈ అంశంపై ఈసీఏ ఇంటర్నేషనల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ఒక అధ్యయనం చేసింది.

WhatsApp: వాట్సాప్ నిలిచిపోవడానికి కారణం ఇదే.. కంపెనీ ఏం చెప్పిందంటే

దీని ప్రకారం.. వచ్చే ఏడాది వేతనాల పెరుగుదలపై ద్రవ్యోల్బణ ప్రభావం అధికంగా ఉంటుంది. 37 శాతం దేశాల్లో మాత్రమే వేతనాల పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉంటుంది. అత్యధికంగా యూరప్‌లో ద్రవ్యోల్బణ ప్రభావం కనిపిస్తుంది. ఐరోపా ఖండంలో వేతనాల పెరుగుదల ఈ సారి భారీగా తగ్గనుంది. ఈ సారి సగటున 1.5 శాతం వేతనాలు తగ్గే అవకాశం ఉంది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 9.1 శాతం చేరిన నేపథ్యంలో వేతనాల పెరుగుదల భారీగా తగ్గనుంది. వేతనాలు 3.5 శాతం పెరిగినప్పటికీ, ద్రవ్యోల్బణం కారణంగా అవి 5.6 శాతం తగ్గుదలతో సమానం. అమెరికాలో ఒక్క శాతం మాత్రమే వేతనాలు పెరిగే అవకాశం ఉంది. అంటే వేతనాలు ఇంకా ఎక్కువగా పెరిగినప్పటికీ, ద్రవ్యోల్బణం కారణంగా అవి తక్కువగానే కనిపిస్తాయి. ఐరోపా, అమెరికాలతో పోలిస్తే వచ్చే ఏడాది ఆసియా దేశాల్లోనే వేతనాల పెరుగుదల అధికంగా ఉండే అవకాశం ఉంది.

Ayodhya Temple: అప్పటినుంచే భక్తులకు అయోధ్య రామ మందిరం అందుబాటులోకి.. వెల్లడించిన ట్రస్టు సభ్యుడు

వేతనాలు ఎక్కువగా పెరిగే టాప్ 10 దేశాల్లో ఎనిమిది ఆసియా నుంచే కావడం గమనార్హం. వీటిలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో సగటున 4.6 శాతం వేతనాలు పెరుగుతాయని అంచనా. ఆ తర్వాత వియత్నాం (4.0 శాతం), చైనా (3.8 శాతం), బ్రెజిల్ (3.4 శాతం), సౌదీ అరేబియా (2.3 శాతం), మలేసియా (2.2 శాతం), కంబోడియా (2.2 శాతం), థాయ్‌లాండ్ (2.2 శాతం), ఓమన్ (2.0 శాతం), రష్యా (1.9 శాతం)లో వేతనాల పెరుగుదల ఉంటుంది. వేతనాలు భారీగా తగ్గబోయే దేశాల్లో పాకిస్తాన్ -9.9 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఘనా -11.9 శాతం, టర్కీ -14.4 శాతం, శ్రీలంక -20.5 శాతం, అర్జెంటీనా -26.1 శాతం ఉన్నాయి.