మీకు వాట్సప్‌లో డబ్బులు పంపడం తెలుసా..

  • Published By: Subhan ,Published On : June 8, 2020 / 07:06 AM IST
మీకు వాట్సప్‌లో డబ్బులు పంపడం తెలుసా..

మహమ్మారి వ్యాప్తి జరుగుతున్న సమయంలో ప్రజలు పేమెంట్ల కోసం ఎక్కడికిపోతారు. దాదాపు డిజిటల్ పేమెంట్స్ కు అలవాటుపడ్డారు కాబట్టి.. కరోనా నుంచి కాస్త సేఫ్ అయినట్లే. కానీ, సోషల్ మీడియాలో ఎక్కువ కమ్యూనికేషన్ అందిస్తున్న వాట్సప్ కూడా పేమెంట్ ప్రోసెస్ మొదలుపెట్టేసింది. ఇతర డిజిటల్ వ్యాలెట్ల నుంచి పేమెంట్లు చేసి వాట్సప్ లో స్క్రీన్ షాట్లు పంపుకోవడం ఎందుకు. 

నేరుగా వాట్సప్‌లోనే పేమెంట్లు చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మరో పేమెంట్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. మరి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధారంగా పనిచేసే వాట్సప్ పేమెంట్లు ఎలా చేయాలి. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ట్రాన్సాక్షన్ పద్ధతేంటి. 

పేటీఎం వ్యాలెట్ వాడినట్లుగా కాకుండా గూగుల్ పేలో మాదిరిగా నేరుగా అకౌంట్ నుంచి బిల్స్ పేమెంట్లు, గోల్డ్ కొన్నట్లుగా వాడేసుకోవచ్చు. మేజర్ బ్యాంకులు అయిన  ICICI Bank, HDFC Bank, Axis Bank, State Bank of India తో మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవేళ మీరు వాట్సప్ పేమెంట్ చేయడానికి రెడీగా ఉంటే ఈ ప్రోసెస్ తెలుసుకోండి. 

ఫోన్లో వాట్సప్ ఓపెన్ చేయండి.

కుడివైపున మూలలో ఉన్న మూడు చుక్కల మీద క్లిక్ చేయండి.

అక్కడ పేమెంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.

అందులో యాడ్ పేమెంట్ మెథడ్ ఎంచుకోండి. 

అది సపోర్టింగ్ డివైజ్ ల లిస్ట్ చూపిస్తుంది. 

అప్పుడు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో దానిని సెలక్ట్ చేయండి. 

మీ ఫోన్ కు వెరిఫికేషన్ మెసేజ్ కావాలా అని అడుగుతుంది. యస్ అనే సమాధానం ఇవ్వండి. 

వెరిఫికేషన్ ముగిశాక ఆ నెంబర్‌తో ఉన్న బ్యాంకు అకౌంట్లను చూపిస్తుంది. వాటిల్లో ఒకటి ఎంచుకోండి. 

ప్రక్రియ పూర్తయిపోయింది. కాబట్టి ఇక ముగించేయండి. 

ఇక పేమెంట్ చేయడం తెలిసిందే. ఏ నెంబర్‌కు కావాలో దానిని సెలక్ట్ చేయండి. కొన్నింటిలో స్కానింగ్ కోడ్ వస్తుంది. అది స్కాన్ చేయండి. ఆ తర్వాత యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. 

Read: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు