Shraddha Murder Case: శ్రద్ధాను హత్యచేసింది నేనే.. ఇప్పుడు ఆ విషయాలేవీ నాకు గుర్తుకురావడం లేదు.. కోర్టులో నిందితుడు

న్యాయస్థానం నిందితుడు ఆఫ్తాబ్ ను విచారించింది. ఈ క్రమంలో శ్రద్ధాను హత్య చేసింది నేనే అని నిందితుడు అంగీకరించాడు. అయితే, శ్రద్ధాను నేను కావాలని చంపలేదని, క్షణికావేశంలో అలా జరిగిపోయిందని అన్నాడు.

Shraddha Murder Case: శ్రద్ధాను హత్యచేసింది నేనే.. ఇప్పుడు ఆ విషయాలేవీ నాకు గుర్తుకురావడం లేదు.. కోర్టులో నిందితుడు

Shraddha Murder Case

Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ సమయంలో పోలీసులను తప్పుదోవపట్టించే ప్రయత్నం నిందితుడు చేస్తుండటంతో నార్కో టెస్ట్ పరీక్షలకు సైతం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ఆఫ్తాబ్‌కు విధించిన ఐదు రోజుల పోలీసుల కస్టడీ పూర్తికావడంతో విచారణ గడువు పొడగింపుకోసం పోలీసులు సాకేత్ కోర్టును ఆశ్రయించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరుపర్చారు.

Shradha Murder Case: శ్రద్ధా మృతికేసులో కిల్లర్ అఫ్తాబ్‌కు నార్కో పరీక్షలు.. కోర్టు అనుమతి

న్యాయస్థానం నిందితుడు ఆఫ్తాబ్ ను విచారించింది. ఈ క్రమంలో శ్రద్ధాను హత్య చేసింది నేనే అని నిందితుడు అంగీకరించాడు. అయితే, శ్రద్ధాను నేను కావాలని చంపలేదని, క్షణికావేశంలో అలా జరిగిపోయిందని అన్నాడు. హత్య జరిగి నెలలు గడవడంతో ఆ రోజు జరిగిన విషయాలు నాలా చాలావరకు గుర్తుకు రావటం లేదని నిందితుడు తెలిపాడు. కేసు దర్యాప్తు కోసం నేను పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నానని, నేను చెప్పేవన్నీ నిజాలేనని, శ్రద్ధా శరీర భాగాలను విసిరేసిన ప్రాంతాల గురించి కూడా పోలీసులకు చెప్పానని న్యాయస్థానం వద్ద నిందితుడు పేర్కొన్నాడు. విచారణ అనంతరం పోలీసు కస్టడీని న్యాయస్థానం మరో నాలుగు రోజులు పొడిగించింది.

Shradha Murder Case: ఢిల్లీలో దారుణం.. యువతిని 35ముక్కలుగా నరికి నగరంలో పడేసిన మానవ మృగం

ఇదిలాఉంటే.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు శ్రద్ధా హత్యకేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. శ్రద్ధా శరీరభాగాలను కట్ చేసేందుకు ఉపయోగించిన రంపం, కత్తిని ఎక్కడ పడేశాడనే విషయాన్ని నిందితుడు తెలిపినట్లు ఢిల్లీ పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.