Minister Nitin Gadkari : ‘‘గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో విడ్డూరంగా ఉందే’’..అంటూ ఆశ్చర్యపోయిన కేంద్రమంత్రి గడ్కరి
‘‘గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో విడ్డూరంగా ఉందే..ఆ విషయాన్ని ఓ ఐఏఎస్ అధికారి అతి సాధారణంగా చెప్పటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది ’’..అంటూ ఆశ్చర్యపోయారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి.

Minister Nitin Gadkari : ఈదురు గాలులకు గాలికి చెట్టు కూలిపోయింది..లేదా టవర్ కూలిపోయింది అనే మాటలు వింటుంటాం. కానీ ఏకంగా ఓ భారీ వంతెనే కూలిపోయింది తెలిసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఆశ్చర్యపోయారు. అదికూడా ఓ ఐఏఎస్ అధికారి ఈ విషయాన్ని అదేదో అత్యంత సాధారణ విషయం అని చెప్పటంతో మంత్రి గడ్కరి ఖంగుతిన్నారట. ఆ విషయాన్ని మంత్రిగారే స్వయంగా చెప్పుకొచ్చారు.
కాగా..బిహార్‌లో ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ భారీ వంతెన కొంతభాగం కూలిపోయింది. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరణ కోరారు. దీంతో ఆ వంతెన గాలికి కూలిపోయింది అని ఐఏఎస్ అధికారి ఒకరు సమాధానమిచ్చారట. దీంతో కేంద్రమంత్రి గడ్కరి ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని స్వయంగా గడ్కరీనే చెప్పడం మరో విశేషం.
ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గడ్కరీ మాట్లాడుతూ గాలికి వంతెన కూలిపోయిన విషయాన్ని చెప్పుకొచ్చారు..‘‘ఏప్రిల్ 29న బిహార్‌లో ఓ వంతెన కూలింది. దీనికి కారణమేంటని నేను నా సెక్రటరీని అడిగాను..దానికి అతను బలమైన గాలులు వీయడం వల్లే బ్రిడ్జి కూలిందని తేలిగ్గా చెప్పేశారు. ఓ ఐఏఎస్ అధికారి ఇలాంటి వివరణ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. అయినా గాలుల వల్ల వంతెన ఎలా కూలుతుందో నాకర్థం కాలేదు. నిర్మాణంలో ఏమైనా లోపం ఉందేమో’’ అని గడ్కరీ చెప్పుకొచ్చారు. నాణ్యాతపరమైన లోపాలు లేకుండా తక్కువ ఖర్చులో వంతెనల నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి ఈ సందర్భంగా అన్నారు.
కాగా..బిహార్‌లోని సుల్తాన్‌గంజ్, అగౌనీ ఘాట్ మధ్య రూ.1710 కోట్లతో 2014లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభించారు. దీని పొడవు 3.116కిలోమీటర్లు. 2019 నాటికే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అనుకున్న సమచానికి పూర్తి కాలేదు. ఈక్రమంలో ఏప్రిల్ 29న ఈ వంతెనలోని కొంత భాగం కూలిపోయింది. దీనిపై సీఎం నీతీశ్ కుమార్ దర్యాప్తునకు ఆదేశించినట్లు సుల్తాన్‌గంజ్ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ మండల్ వెల్లడించారు. బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత తక్కువ ఉన్న మెటీరియల్ వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
- బండి కింద బాంబుల్లా మారిన ఈవీ బ్యాటరీలు
- Nitin Gadkari : EV కంపెనీలకు మంత్రి గడ్కరీ హెచ్చరిక.. భద్రత లోపిస్తే భారీ మూల్యం తప్పదు..!
- Maharashtra : “RSS ఆసుపత్రిలో హిందువులకు మాత్రమే వైద్యం చేస్తారా…?”మంత్రి గడ్కరిని ప్రశ్నించిన రతన్ టాటా
- Nitin Gadkari Ola EV: ఓలా విద్యుత్ వాహనాన్ని తనిఖీ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- Road Accidents : రోడ్డుప్రమాద మృతుల్లో అగ్రస్థానంలో భారత్ : నితిన్ గడ్కరీ
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్‌న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!