Protect Women: 56ఏళ్ల మహిళపై రేప్, ఐరన్ రాడ్‌తో టార్చర్

చత్తీస్‌ఘడ్‌లో అత్యంత దారుణంగా 56ఏళ్ల మహిళపై అత్యాచారం జరిపి ఇనుపరాడ్ తో టార్చర్ చేయడంతో పాటు తలని బండరాయితో కొట్టి హతమార్చారు. మానసిక వైకల్యం ఉన్న ఆ మహిళను బెదిరించి..

Protect Women: 56ఏళ్ల మహిళపై రేప్, ఐరన్ రాడ్‌తో టార్చర్

arrested

Protect Women: చత్తీస్‌ఘడ్‌లో అత్యంత దారుణంగా 56ఏళ్ల మహిళపై అత్యాచారం జరిపి ఇనుపరాడ్ తో టార్చర్ చేయడంతో పాటు తలని బండరాయితో కొట్టి హతమార్చారు. మానసిక వైకల్యం ఉన్న ఆ మహిళను బెదిరించి ఈ ఘటనకు పాల్పడినట్లు జాంజ్‌గిర్-చంపా జిల్లా పోలీసులు చెబుతున్నారు. ముందుగా రోడ్ ప్రమాదంలో చనిపోయి ఉండొచ్చని భావించగా.. పోస్టుమార్టంలో నిజాలు బయటికొచ్చాయి.

విచారణలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. దాంతో అసలు విషయం తెలిసింది. రోడ్డుపై ఈడ్చుకెళ్తూ ఉన్నట్లు అందులో రికార్డ్ అయింది. కడుపుపై తన్నడం, కాళ్లపై కొట్టడం, ఇనుపరాడ్ తో హింసించడం వంటివి అందులో గమనించారు.

కొన్నేళ్ల క్రితమే పేరెంట్స్ ను కోల్పోయిన మానసిక వైకల్యం ఉన్న మహిళ.. స్థానికులు పెట్టింది తిని కాలం వెళ్లదీస్తుంది. అటువంటి మహిళపై 31ఏళ్ల వ్యక్తి పాల్పడినట్లు తెలిసి అతణ్ని అరెస్టు చేశారు పోలీసులు.

Read Also: 28ఏళ్ల తర్వాత రేప్ నిందితుడ్ని పట్టించిన డీఎన్ఏ టెస్ట్

’31 సంవత్సరాల వయస్సునన కిషన్ యాదవ్‌ను అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో జుట్టు పట్టుకుని సమీపంలో ఉన్న ప్లాట్ లోకి తీసుకెళ్లానని చెప్పేశాడు’ అని సీనియర్ పోలీస్ అధికారి అభిషేక్ పల్లవ తెలిపారు.

‘ఘటన జరిగే సమయంలో బాధితురాలు అతణ్ని తోసేస్తూ పోరాడుతూనే ఉంది. కోపంతో విసిరికొడుతున్నా.. కిషన్ ఆమెను కొడుతూ.. దాడి చేస్తూనే ఉన్నాడు. అలా ప్రాణం తీసేశాడని పోస్టుమార్టంలో తేలింది. మర్డర్, రేప్ లకు పాల్పడినట్లుగా నిర్ధారించి నేరస్థుడ్ని జైలుకు పంపించాం’ అని పల్లవ వెల్లడించారు.