దుస్సాహసం : జూలు విదిల్చిన ఇండియన్ ఆర్మీ, 20 మంది చైనా సైనికులకు గాయాలు

దుస్సాహసం : జూలు విదిల్చిన ఇండియన్ ఆర్మీ, 20 మంది చైనా సైనికులకు గాయాలు

India, China soldiers : పక్కలో బల్లాన్నీ… చైనానీ పక్కపక్కన పెడితే… ఏది ఏదో గుర్తుపట్టలేం. రెండూ ఒకేలా ఉంటాయి. పక్కలో బల్లెం కంటే ప్రమాదకరమైనది డ్రాగన్. తెల్లారి లేస్తే కుట్రలు, కుతంత్రాలు. ఎప్పుడు ఏ దేశ భూభాగాన్ని దోచుకుందామా అని కాచుక్కూర్చుంటారు. సరిహద్దుల్లో తెగ రెచ్చిపోవడం దానికి అలవాటు. తాజాగా సిక్కిం సరిహద్దుల్లో… చొచ్చుకు వచ్చేందుకు చైనా సైన్యం యత్నించడంతో… భారత్ ఆర్మీ డ్రాగన్‌ను గట్టిగా అడ్డుకుంది. భీకరమైన పోరాటం జరగడంతో చైనా సైనికులు 20 మంది ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. ఉత్తర సిక్కింలోని నాథులా లోయ సరిహద్దు దగ్గర ఈ ఘటన జరిగింది.

గుంటనక్కల్లా సరిహద్దు దాటుతున్న చైనా సైనికుల్ని భారత సైన్యం చూసీ చూడగానే… వెనక్కి వెళ్లమని వార్నింగ్ ఇచ్చింది. దీంతో డ్రాగన్ సైన్యం దాడులు చేసేందుకు యత్నించగా… భారత్ దాన్ని తిప్పి కొట్టింది. ఇదివరకు ఇలాంటి కుట్రలు చాలా జరగడంతో… ఆల్రెడీ అలర్టై ఉన్న ఇండియన్ ఆర్మీ జూలు విదిల్చడంతో డ్రాగన్ తోకముడిచింది.
ఈ ఘటన జరిగినప్పుడు అక్కడి వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. అసలు అలాంటి వాతావరణంలోనే చొచ్చుకు వెళ్లొచ్చని చైనా సైన్యం కుట్ర పన్నింది.

అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ చైనా ఆనందాన్ని తీర్చేసింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉన్నా… నిలకడగా ఉందని ఇండియన్ ఆర్మీ వర్గాల తెలిపాయి. గడ్డకట్టే మైనస్ డిగ్రీల వాతావరణంలో తట్టుకుంటూ భారత్ ఆర్మీ నిఘా ఉంచుతోంది. నాకూలా లాంటి చోట బైనాక్యులర్లు కూడా పనిచేయవు. వాటిపైనా మంచు పేరుకుపోతుంది. అయినప్పటికీ జాగ్రత్తగా పహారా కాస్తోంది.

గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తూర్పు లఢఖ్‌లోని పాంగాంగ్, గాల్వాన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్ తదితర ప్రాంతాల్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణలు జరిగాయి. గతేడాది జూన్ 15న లఢఖ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా ఆర్మీ… ఘర్షణకు దిగింది. ఆ ఘటనలో భారత సైనికులు 20 మంది అమరులయ్యారు. గాల్వన్‌ ఘటన తర్వాత భౌతికంగా భారత-చైనా కొట్టుకొవడం ఇదే తొలిసారి. గాల్వన్ ఘర్షణల్లో భారత సైన్యం దెబ్బెంటో రుచి చూసినప్పటికీ చైనా మరోసారి మన భూభాగంలోకి ప్రవేశించే దుస్సాహసానికి ఒడిగట్టింది. అయితే ఇండియన్ ఆర్మీ తన్ని తరిమేయడంతో డ్రాగన్‌కు చెక్ పెట్టినట్లయింది.