India Covid-19 Vaccine : దేశంలో ఏడాది కాలంగా 156 కోట్ల మందికి వ్యాక్సిన్

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ను  ఎదుర్కోటానికి భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి (జనవరి 16) నేటికి ఏడాది పూర్తయ్యింది.

India Covid-19 Vaccine : దేశంలో ఏడాది కాలంగా 156 కోట్ల మందికి వ్యాక్సిన్

India Vaccintaion

India Covid-19 Vaccine :  ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ను  ఎదుర్కోటానికి భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి (జనవరి 16) నేటికి ఏడాది పూర్తయ్యింది. ఫ్రంట్ లైన్ వారియర్లతో ప్రారంభమైన టీకా ప్రక్రియ ఏడాది కాలంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించింది. గతేడాది ఇదే సమయానికి టీకాలు వేసే క్రమంలో టీకాలపై ప్రజలకు ఎన్నో అపోహలు.. అనుమానాలు ఉండేవి.

మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినే వేయటం ప్రారంభించగా… మార్చి 1 నుంచి 60 ఏళ్ల పైబడిన వృధ్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి  టీకా అందించారు. ఆతర్వాత ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి… ఆతర్వాత మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు వేశారు.  గతేడాది నవంబర్ నుంచి ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేయటం ప్రారంభించారు.  ఈ నెల 3వ తేదీ నుంచి 15-18 ఏళ్ల మధ్య వయస్సు  వారికి టీకాలు వేస్తూ వచ్చారు. ఈనెల 10 వ తేదీనుంచి  వృధ్ధులకు ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ అందిస్తున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పై అవగాహన కల్పిస్తూ విస్తృతంగా టీకాలు వేయటం ప్రారంభించింది. దీంతో ప్రజలు తమ భయాలను పక్కన పెట్టి టీకా వేయించుకోటానికి ముందుకు వచ్చారు. ఈ 365 రోజుల్లో 156కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. అందులో 90 కోట్ల మందికి పైగా మొదటి డోసు , 62 కోట్ల మందికి పైగా రెండో డోసు తీసుకున్నారు. 42 లక్షల మందికి ఇప్పటి వరకు బూస్టర్ డోసు అందించి భారత్ ప్రపంచంలోనే రికార్డు నెలకొల్పింది.

ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు అందిన సమచారం మేరకు భారత దేశంలో 156 కోట్ల 92 లక్షల 23 వేల పైచిలుకు వ్యాక్సిన్ లు వేశారు . గత 24 గంటల్లో 66 లక్షల వ్యాక్సిన్ డోసులు వేశారు. ఈ సందర్బంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ లో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు దేశ ప్రజలకు శుభాకాంక్షలు అందచేశారు.
Also Read : Kanuma Festival : కనుమ పండుగ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గోపూజ