కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం నయా స్కెచ్

  • Published By: madhu ,Published On : April 7, 2020 / 01:09 AM IST
కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం నయా స్కెచ్

కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించినా..కొత్త కొత్త కేసులు నమోదవుతుండడం భారత ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. లాక్ డౌన్ ఉన్నా..కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై నజర్ పెట్టింది.

వైరస్ మెడలు వంచాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా సరికొత్త ప్రణాళికలు రచించింది. తీవ్రంగా వ్యాపించిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య పూర్తిగా నిలిచిపోయ వరకు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది.

ఇందుకు అగ్రెసివ్ కంటెన్మెంట్ స్ట్రాటజీ పేరిట 20 పేజీల డాక్యుమెంట్ సిద్ధం చేసింది. దీనిని హెల్త్ మినిస్ట్రీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. హాట్ స్పాట్లుగా ఉన్న ప్రాంతాల్లో కనీసం నెల రోజుల పాటు ఆంక్షలు కంటిన్యూ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

వైరస్ క్లస్టర్లుగా మారిన ప్రాంతాల్లో 4 వారాల పాటు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకుండా ఆగిపోయేంత వరకు కఠినంగా ఉండాలని భావిస్తోంది. H1N1 ఇన్ ఫ్లుయెంజా మాదిరిగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వైరస్ సోకుతోందని భావిస్తోంది. 

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 67కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 24 గంటల్లో 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. 30 మంది కరోనాతో మృతి చెందారని వెల్లడించారు. ఢిల్లీలోని మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించినట్లు తెలిపారు. (వామ్మో కరోనా : ఏపీలో 303 కేసులు..కర్నూలులో అత్యధికం)