Covid Wave : ఆగస్టులోనే క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్రారంభం, సెప్టెంబర్ లో పీక్.. ఎస్బీఐ షాకింగ్ రిపోర్టు

దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? వచ్చే నెలలోనే మూడో వేవ్ ప్రారంభం కానుందా? అంటే అవుననే అంటోంది ఎస్బీఐ.

Covid Wave : ఆగస్టులోనే క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్రారంభం, సెప్టెంబర్ లో పీక్.. ఎస్బీఐ షాకింగ్ రిపోర్టు

Covid Wave

Covid Third  Wave : దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? వచ్చే నెలలోనే మూడో వేవ్ ప్రారంభం కానుందా? అంటే అవుననే అంటోంది ఎస్బీఐ. క‌రోనా సెకండ్ వేవ్ కల్లోలం నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. క్ర‌మంగా కొత్త కేసులు తగ్గుతున్నాయి. ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే మూడో వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని ఎస్బీఐ తాజా స‌ర్వే చెబుతోంది. వచ్చే నెల అంటే ఆగ‌స్టులోనే ఈ మూడో వేవ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని త‌న తాజా నివేదిక‌లో హెచ్చ‌రించింది. కొవిడ్‌-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్బీఐ త‌న ప‌రిశోధ‌న నివేదిక‌ను రూపొందించింది. కొవిడ్ థ‌ర్డ్ వేవ్ పీక్ సెప్టెంబ‌ర్‌లో ఉంటుంద‌నీ ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది.

ఇండియాలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన న‌మోదైంద‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం డేటా ప్ర‌కారం చూసుకుంటే ఇండియాలో జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు న‌మోదు కావ‌చ్చు. అయితే ఆగ‌స్ట్ రెండో ప‌క్షంలో కేసుల సంఖ్య మ‌ళ్లీ భారీగా పెర‌గొచ్చ‌ని ఎస్బీఐ రిపోర్ట్ అంచ‌నా వేసింది.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ స‌గ‌టు పీక్ స్టేజీ కేసులు రెండో వేవ్ పీక్ స్టేజీలో న‌మోదైన కేసుల కంటే 1.7 రెట్లు ఎక్కువ‌గా ఉండ‌నున్న‌ట్లు గ్లోబ‌ల్ డేటా చెబుతోంది. ఆగ‌స్టు రెండో వారంలో కేసుల సంఖ్య క్ర‌మంగా పెర‌గ‌డం ప్రారంభ‌మై.. నెల‌లోపు పీక్ స్టేజీకి వెళ్లే చాన్స్ ఉంది. ఇక వ్యాక్సినేష‌న్ల విష‌యానికి వ‌స్తే.. దేశంలో స‌గ‌టున రోజుకు 40 వ్యాక్సిన్లు ఇస్తున్నారు. దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతం కాగా.. 20.8 శాతం మంది తొలి డోసు వేసుకున్నారు. వచ్చే నెలలోనే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కానుందని, సెప్టెంబర్ లో పీక్ కి వెళ్లనుందన్న ఎస్బీఐ నివేదిక అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.