India Beat England: కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన మహిళా క్రికెట్ జట్టు

కామన్వెల్త్‌లో చరిత్ర సృష్టించేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు రెడీ అవుతోంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలుపొందడం ద్వారా ఫైనల్‌కు చేరి, భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

India Beat England: కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన మహిళా క్రికెట్ జట్టు

India Beat England: భారత మహిళా క్రికెట్ జట్టు కామన్వెల్త్‌లో చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలుపొందడం ద్వారా ఫైనల్‌కు చేరింది. భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. కామన్వెల్త్‌లో మహిళా క్రికెట్‌కు స్థానం కల్పించడం ఇదే మొదటిసారి.

Woman Suicide: ఆడపిల్లల్ని కన్నందుకు భర్త వేధింపులు.. అమెరికాలో భారతీయ మహిళ ఆత్మహత్య

అయితే, మొదటిసారే మన జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 164/5 స్కోరు సాధించింది. తర్వాత 165 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టును మన బౌలర్లు 160 పరుగులకే పరిమితం చేశారు. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 4 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. క్రికెట్ అభిమానులకు మంచి మజా ఇచ్చింది. భారత బ్యాటింగ్‌లో స్మృతి మంధాన 32 బంతుల్లో 61 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో భారత స్కోర్ బోర్డును పరుగులెత్తించింది. స్మృతి మంధాన 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం.

Jabalpur Fire: ఆ డాక్టర్లను పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి.. ఎందుకంటే

ఆమె తర్వాత రోడ్రిగ్స్ 31 బంతుల్లో 44 పరుగులు సాధించింది. భారత కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ 20 బంతుల్లో, 20 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు సంబంధించి కెప్టెన్ నటాలీ స్కివర్ 41 పరుగులు సాధించగా, డేనియల్ వ్యాట్ 35 పరుగులు సాధించింది. ఫైనల్ చేరడం ద్వారా భారత్ స్వర్ణ లేదా రజత పతకం గెలవడం ఖాయం చేసుకుంది. ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.