Woman Suicide: ఆడపిల్లల్ని కన్నందుకు భర్త వేధింపులు.. అమెరికాలో భారతీయ మహిళ ఆత్మహత్య

ఆడపిల్లల్ని కన్నందుకు భర్త వేధించడంతో ఒక భారతీయ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. మృతురాలు మన్‌దీప్ కౌర్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్‌. ఈ ఘటనపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Woman Suicide: ఆడపిల్లల్ని కన్నందుకు భర్త వేధింపులు.. అమెరికాలో భారతీయ మహిళ ఆత్మహత్య

Woman Suicide: ఆడపిల్లల్ని కన్నందుకు మహిళల్నే బాధ్యుల్ని చేసి, వేధించే ఆటవిక సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది. ఆడ పిల్లల్ని కన్నందుకు భర్త వేధించడంతో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది.

Jabalpur Fire: ఆ డాక్టర్లను పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి.. ఎందుకంటే

ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్‌కు చెందిన మన్‌దీప్ కౌర్ అనే పంజాబీ మహిళకు, అమెరికాలో ఉంటున్న రంజోధ్‌బీర్ సింగ్ అనే వ్యక్తితో 2015లో వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి కుటుంబంతో అమెరికాలోని న్యూయార్క్‌లోనే ఉంటున్నారు. కొంతకాలానికి మన్‌దీప్ కౌర్ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో భర్త, అతడి కుటుంబం ఆమెను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో వేధింపులు భరించలేక అక్కడే మన్‌దీప్ కౌర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు తన బాధను చెప్పుకుంటూ, ఏడుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. భర్త, అతడి కుటుంబ సభ్యులు తనను దాదాపు ఎనిమిదేళ్ల నుంచి వేధిస్తున్నట్లు ఆమె వీడియోలో పేర్కొంది. రోజూ కొడుతున్నారని, ఏదో ఒక రోజు వారు మారుతారని ఇన్నాళ్లూ ఎదురు చూసినట్లు చెప్పింది. వేధింపులు ఆగకపోవడంతో, ఇక వాటిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వివరించింది.

TikTok: ‘టిక్‌టాక్’ మళ్లీ వస్తోందా.. అసలు నిజమేంటి?

మన్‌దీప్ కౌర్‌కు నాలుగేళ్లు, రెండేళ్ల వయసు కలిగిన ఇద్దరు కూతుళ్లున్నారు. ప్రస్తుతం మన్‌దీప్ కౌర్ వీడియో అక్కడి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వేధింపులు ఉంటాయా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలోని పంజాబీల హక్కుల కోసం పోరాడే ‘ద కౌర్ మూమెంట్’ సంస్థ దీనిపై విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అక్కడివాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.