Jabalpur Fire: ఆ డాక్టర్లను పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి.. ఎందుకంటే

పరారీలో ఉన్న ముగ్గురు డాక్టర్లతోపాటు, ఒక మేనేజర్‌ను పట్టించినా లేదా వారి ఆచూకీ చెప్పినా పది వేల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఒక్కో డాక్టర్‌కు పదివేల రూపాయలు అందిస్తామన్నారు.

Jabalpur Fire: ఆ డాక్టర్లను పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి.. ఎందుకంటే

Jabalpur Fire: ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి ఆస్పత్రిని నిర్వహిస్తున్న ముగ్గురు డాక్టర్లు, ఒక సీనియర్ మేనేజర్ కనిపించకుండా పోయారు.

TikTok: ‘టిక్‌టాక్’ మళ్లీ వస్తోందా.. అసలు నిజమేంటి?

ప్రస్తుతం వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన జరిగి దాదాపు వారం రోజులు కావస్తున్నా, వీరిని పోలీసులు ఇంకా పట్టుకోలేకపోయారు. దీంతో ముగ్గురు డాక్టర్లతోపాటు, మేనేజర్ ఆచూకీ చెప్పిన వారికి మధ్యప్రదేశ్ పోలీసులు నగదు బహుమతి ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున బహుమతిగా అందిస్తామని చెప్పారు. ఆస్పత్రి డైరెక్టర్, అధినేత డా.నితీష్ గుప్తా, డా సురేష్ పటేల్, డా.సంజయ్ పటేల్, సీనియర్ మేనేజర్ విపిన్ పాండే ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో సరైన రక్షణ చర్యలు లేవు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేని బిల్డింగులో ఆస్పత్రిని నిర్వహించారు.

Tiniest Bike: అతిచిన్న సైకిల్ నడిపిన వృద్ధుడు.. ఆకట్టుకుంటున్న క్రేజీ వీడియో

దీంతో ఎనిమిది మంది మరణించారు. అయితే, ఈ ఘటనతో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిబంధనలకు అనుగుణంగా, ఫైర్ సేఫ్టీ లేని 28 ఆస్పత్రుల అనుమతుల్ని జబల్‌పూర్‌ అధికారులు రద్దు చేశారు. మిగతా ఆస్పత్రుల్ని కూడా తనిఖీ చేసి, నోటీసులు జారీ చేస్తున్నారు.