సరిహద్దులో చైనాకు తగిన సమాధానం.. దళాలు, ఆయుధాలను మోహరిస్తున్న భారత్

  • Published By: vamsi ,Published On : September 1, 2020 / 09:36 AM IST
సరిహద్దులో చైనాకు తగిన సమాధానం.. దళాలు, ఆయుధాలను మోహరిస్తున్న భారత్

సరిహద్దు ప్రాంతంలో చైనా దూకుడుకు తగిన సమాధానం చెబుతుంది భారత్.. చైనా చేష్టల దృష్ట్యా, భారత సైన్యం తూర్పు లడఖ్‌లోని పంగోంగ్ సరస్సు చుట్టూ ‘వ్యూహాత్మక పాయింట్ల’ వద్ద దళాలు మరియు ఆయుధాలను మోహరించింది. చొరబడటానికి చైనా చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న తర్వాత తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్‌ఐసి) వెంట అన్ని ప్రాంతాలలో మొత్తం నిఘా యంత్రాంగాన్ని బలోపేతం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.



తూర్పు లడఖ్‌లోని మొత్తం పరిస్థితిని ఉన్నత సైనిక, రక్షణ అధికారులు సమీక్షించారు. ఘర్షణపై ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నార్వాన్ కూడా ఉన్నత సైనిక అధికారులతో సమావేశం నిర్వహించారు. తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఐసి పక్కనే ఉన్న ప్రాంతాల్లో నిఘా పెంచాలని వైమానిక దళాన్ని కోరినట్లు వర్గాలు తెలిపాయి. చైనా వ్యూహాత్మకంగా ముఖ్యమైన హోటాన్ ఎయిర్ బేస్ వద్ద సుదూర యుద్ధ విమానాలైన జె-20తో పాటు కొన్ని ఇతర ఆయుధాలను మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి.
https://10tv.in/late-former-president-of-india-political-journey/
గత మూడు నెలల్లో, భారత వైమానిక దళం తన ప్రధాన యుద్ధ విమానాలైన సుఖోయ్-30 ఎంకేఐ, జాగ్వార్ మరియు మిరాజ్-2000ను తూర్పు లడఖ్ ప్రధాన సరిహద్దు వైమానిక స్థావరాలు మరియు ఎల్ఐసి సమీపంలోని ఇతర ప్రదేశాలకు మోహరించింది.



పర్వత ప్రాంతంలో ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు చైనాకు పరోక్షంగా తెలియజేయడానికి భారత వైమానిక దళం తూర్పు లడఖ్ ప్రాంతంలో రాత్రిపూట వైమానిక గస్తీని చేపట్టింది. వైమానిక దళం తూర్పు లడఖ్‌లోని అపాచీ పోరాట హెలికాప్టర్లతో పాటు వివిధ ముందస్తు రంగాల్లో దళాలను రవాణా చేయడానికి చినూక్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్లను మోహరించింది.

జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య హింసాత్మక ఘర్షణ తరువాత 20 మంది భారత ఆర్మీ సైనికులు అమరవీరులైన తర్వాత ఇరు దేశాల మధ్య కాస్త వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే చైనా సైనికులు చొరబాటుకు ప్రయత్నించగా భారత సైన్యం ఎదురుదాడి చేస్తుంది. ఈ క్రమంలో చైనా తన సైనికులలో ఎంతమంది చంపబడ్డారో బహిరంగంగా చెప్పలేదు. అయితే, అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఇందులో 35 మంది చైనా సైనికులు మరణించారు. భారతదేశం మరియు చైనా గత రెండున్నర నెలల్లో అనేక రౌండ్ల సైనిక మరియు దౌత్య చర్చలు జరిగాయి, కాని తూర్పు లడఖ్‌లో సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడంలో గణనీయమైన పురోగతి కనిపించట్లేదు.