Indian ARMY Jet Pack Suits : గాల్లో ఎగిరెళ్లి శతృవుల భరతం పట్టటానికి భారత జవాన్లకు ‘జెట్‌ప్యాక్ సూట్స్’..వీటి ప్రత్యేకతలేంటంటే..

గాల్లో ఎగిరెళ్లి శతృవుల భరతం పట్టటానికి భారత జవాన్లకు ‘జెట్‌ప్యాక్ సూట్స్’.. ప్రత్యేకతలివే

Indian ARMY Jet Pack Suits : గాల్లో ఎగిరెళ్లి శతృవుల భరతం పట్టటానికి భారత జవాన్లకు ‘జెట్‌ప్యాక్ సూట్స్’..వీటి ప్రత్యేకతలేంటంటే..

Indian ARMY Jet Pack Suits

Indian ARMY Jet Pack Suits : అవెంజర్స్ సిరీస్‌లో ఐరన్ మ్యాన్ మాత్రమే కాదు.. మామూలు మనుషులు కూడా ఈ జెట్‌ప్యాక్ సూట్‌తో పక్షుల్లా గాల్లో ఎగరొచ్చు. వేగంగా ముందుకెళ్లిపోవచ్చు. అద్భుతమైన ఫీల్‌ని, థ్రిల్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అందుకే.. ఇది వరల్డ్ వైడ్ ఇంత పాపులర్ అయింది. మార్పులు-చేర్పులతో.. ఫైనల్‌కి ఈ సూట్ ఓ కొలిక్కి వచ్చింది. అందుకే.. అగ్ర దేశాల ఆర్మీల గురి దీని మీద పడింది. ఈ జెట్స్‌ని.. సోల్జర్స్‌కి ఇస్తే.. ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనకు వచ్చాయ్.  ఆ దిశగానే ట్రయల్స్ కూడా నడుస్తున్నాయ్. ఈ జెట్ ప్యాక్ సూట్.. మనిషిని 10 నుంచి 15 అడుగుల ఎత్తులో గాల్లో ఎగిరేందుకు వీలుగా ఉంటుంది. సూట్ టెస్టింగ్ కూడా సక్సెస్ అయింది.

ఈ సూపర్ జెట్ ప్యాక్ సూట్.. 5 గ్యాస్ టర్బైన్ జెట్ ఇంజిన్స్‌తో పనిచేస్తుంది. దీనిలో ఉన్న ఇంజిన్లు.. థౌజండ్ హార్స్ పవర్‌తో ఉంటాయి. ఇంధనంతో కలుపుకొని.. దీని బరువు 34 కేజీలు ఉంటుంది. ఈ జెట్ సూట్.. డీజిల్ గానీ, కిరోసిన్‌తో గానీ రన్ అవుతుంది. దీంతో.. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుంది. అయితే.. ఈ సూట్‌తో.. ఒక్కరు మాత్రమే గాల్లోకి ఎగిరేందుకు వీలవుతుంది. దీని డిజైన్ కూడా ఒకరికి సరిపోయే విధంగానే తయారుచేశారు.

గాలిలో ఎగిరే టెక్నాలజీతో.. జెట్ ప్యాక్ సూట్స్ తయారుచేసేందుకు కొన్ని కంపెనీలు మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నాయ్. అందులో ఒకటి గ్రావిటీ, మరొకటి.. జెట్ ప్యాక్ ఏవియేషన్. ఈ కంపెనీ.. ఇంకా తమ సూట్ ధరను ప్రకటించలేదు. అయితే.. గ్రావిటీ తయారు చేసిన సూట్‌ మాత్రం కేవలం.. సంపన్నులు మాత్రమే కొనుగోలు చేసేలా ఉంది. ఎందుకంటే.. దీని ధర ఏకంగా 3 కోట్ల రూపాయలు. ఈ జెట్ సూట్‌తో.. గాల్లో ఎగిరేందుకు ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదని.. కొన్ని నిబంధనలు పాటిస్తే చాలని కంపెనీలు చెబుతున్నాయ్. మిలటరీలో వీటి వినియోగం కోసం.. అగ్ర దేశాల ఆర్మీ అధికారులు పరిశీలిస్తున్నారు. యుద్ధ సమయాల్లో, ప్రత్యేక ఆపరేషన్లప్పుడు.. ఇవి ఏ విధంగా ఉపయోగపడుతుందనే దానిపై స్టడీ చేస్తున్నారు.

తూర్పు లద్దాఖ్‌లో.. చైనాతో నెలకొన్న సరిహద్దు ఘర్షణలు, రష్యా-యుక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో.. ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది. కొన్ని నెలలుగా వివిధ రకాల డ్రోన్లతో పాటు ఈ జెట్ ప్యాక్ సూట్స్‌ని కూడా కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇవి గనక మన ఆర్మీ చేతికి అందితే.. మోడ్రన్ ఇండియన్ ఆర్మీని చూస్తాం. ఇప్పటిదాకా.. నడచుకుంటూ వెళ్లి శత్రువులపై దాడి చేసిన వాళ్లనే చూశాం. కొండప్రాంతాల్లో నడవడానికి వీల్లేని పరిస్థితుల్లో.. అత్యంత వేగంగా చేరుకోవాల్సిన సమయంలో ఈ జెట్‌ సూట్స్‌ ఎంతో ఉపయోగపడతాయి. ఇకపై.. మన జవాన్లు ఎగురుకుంటూ వెళ్లి.. శత్రువులపై దాడి చేస్తారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా.. ఇళ్లలో దాక్కున్నా.. చెట్ల పొదల్లో నక్కినా.. గాల్లోకి ఎగిరి.. అక్కడి నుంచే బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. క్షణాల్లో.. టార్గెట్లను లేపేస్తారు. ఈ జెట్ సూట్స్‌తో.. మన ఆర్మీ మరింత పటిష్టంగా మారుతుందనడంలో ఏమాత్రం డౌట్‌లేదు. ఇక.. రోబోటిక్ మ్యూల్స్, టెథర్డ్ డ్రోన్ సిస్టమ్‌లు కూడా వచ్చేస్తే.. భారత సైన్యం మరింత శత్రుదుర్భేద్యంగా మారుతుంది. శత్రువుల కదలికలను పసిగట్టడం, వెంటనే వాటిని తిప్పికొట్టడం అన్నీ క్షణాల్లో జరిగిపోతాయ్. భారీ నష్టం జరగముందే.. ప్రమాదానికి చెక్ పెట్టేస్తారు. అందుకే.. వీలైనంత త్వరగా వీటిని మన జవాన్లకు అందించాలనుకొంటోంది భారత సర్కార్.