ప్యాంటు, సూటు ధరించి పెళ్లి చేసుకున్న మహిళా కార్పొరేట్ లాయర్

  • Published By: madhu ,Published On : November 25, 2020 / 10:24 AM IST
ప్యాంటు, సూటు ధరించి పెళ్లి చేసుకున్న మహిళా కార్పొరేట్ లాయర్

Indian bride who wore a pantsuit to her wedding : వివాహంలో సంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వారి వారి ఆచారాల ప్రకారం..పెళ్లిళ్లు జరుపుకుంటుంటారు. అందులో ప్రధానమైంది వస్త్రధారణ. హిందూ సంప్రదాయంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వస్త్రాలను ధరిస్తుంటారు. అయితే..ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కూతురు భిన్నంగా..ప్యాంటు, సూటు ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.



Indian-American entrepreneur ఉమన్ సంజన రిషి వివాహం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగింది. వ్యాపార వేత్త ధృవ్ మహాజన్ తో పెళ్లి జరిగింది. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. సంజన రిషి అమెరికాలో కార్పొరేట్ న్యాయవాదిగా పనిచేశారు. అమెరికాలో తొలుత పెళ్లి చేసుకున్న అనంతరం సంప్రదాయ పద్ధతిలో ఢిల్లీలో మరోసారి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ..కరోనా కారణంగా..వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తాజాగా వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. సంజన సూటు వేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచాయి.



నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మగవారు సూటు ధరిస్తే ఎవరు అడగరు..కానీ ఓ మహిళ సూటు ధరిస్తే ఎందుకు అభ్యంతరం అని వ్యాఖ్యానించారు. తాను ఇటలీలో ఈ సూట్ ను చూశానని చెప్పారు. ఈ వివాహంలో సన్నిహిత కుటుంబ సభ్యులు, వధూ వరులు, పూజారితో కలిసి మొత్తం 11 మంది మాత్రమే హాజరయ్యారు. ఆమె ఏమి ధరిస్తుందనే విషయం తనకు తెలియదని, ఏ వస్త్రాలు ధరించాలనేది ఆమెకు తెలుసన్నారు ధృవ్.



https://10tv.in/joe-bidens-new-cabinet/
ప్యాటు, సూటులో ఎంతో అందంగా కనిపించిందన్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసిన తర్వాత..ఆమె సన్నిహితులు, ఇతరులు అభినందించారు. చక్కని వధువు అంటూ కామెంట్స్ చేశారు. ఎంత గొప్పగా కనిపిస్తున్నారు..అద్భుతమని డిజైనర్ మసాబా గుప్తా, నటి సోనమ్ కపూర్ వ్యాఖ్యానించారు.