MiG-29 Fighters : భారత వాయుసేనలోకి మిగ్-29 యుద్ధ విమానాలు

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం పూనుకుంది. ఈ నేపథ్యంలోనే రానున్న నాలుగేళ్లలో రక్షణ రంగానికి 5 లక్షల కోట్లు వెచ్చించనుంది. అధునాతన ఆయుధాలు, యుద్ధవిమానాలతోపాటు.. వాటిని సంబందించిన టెక్నాలజీని కొనుగోలు చేయనుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయుధ ఉత్పత్తి కంపెనీలు, ఆయుధాలు అమ్మేదేశాలతో భారత్ సంప్రదింపులు మొదలు పెట్టింది.

MiG-29 Fighters : భారత వాయుసేనలోకి మిగ్-29 యుద్ధ విమానాలు

Mig 29 Fighters

MiG-29 Fighters : రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం పూనుకుంది. ఈ నేపథ్యంలోనే రానున్న నాలుగేళ్లలో రక్షణ రంగానికి 5 లక్షల కోట్లు వెచ్చించనుంది. అధునాతన ఆయుధాలు, యుద్ధవిమానాలతోపాటు.. వాటిని సంబందించిన టెక్నాలజీని కొనుగోలు చేయనుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయుధ ఉత్పత్తి కంపెనీలు, ఆయుధాలు అమ్మేదేశాలతో భారత్ సంప్రదింపులు మొదలు పెట్టింది.

తాజాగా రష్యా నుంచి మింగ్ మిగ్ – 29 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 21 మిగ్ – 29 యుద్ధ విమానాల కోసం భారత్ తమను సంప్రదించినట్లు రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ టెక్నికల్ కో-ఆపరేషన్ ప్రతినిధి తెలిపారు. 2021లో ఈ విమానాలను సరఫరా చేయాలనీ భారత్ నుంచి కొనుగోలు ఆర్డర్ వచ్చినట్లు తెలిపారు.

గతేడాది జూన్ లో రుష్యా నుంచి 21 మిగ్ – 29తో సహా సరికొత్త యుద్ధవిమానాలు కొనుగోలు చేయాలనీ వాయుసేన రక్షణ శాఖ దృష్టికి
తీసుకెళ్లింది. వాయుసేన అభ్యర్థన మేరకు యుద్ధవిమానాలను వేగంగా సేకరించడానికి గతేడాది భారత రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఇక రష్యా ఈ ఏడాది చివరి నాటికి ఆర్డర్ లో కొన్నింటిని అందించనుంది.