Indian Army: సరిహద్దుల్లో నిఘా పెంచిన సైన్యం.. గల్వాన్ లోయలో గడ్డకట్టే చలిలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..

గడ్డకట్టే చలిలోసైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో రాసుకొచ్చింది.

Indian Army: సరిహద్దుల్లో నిఘా పెంచిన సైన్యం.. గల్వాన్ లోయలో గడ్డకట్టే చలిలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..

India Army

Indian Army: చైనాతో ఉద్రిక్తత మధ్య భారత సైన్యం లడఖ్‌లో మరోసారి నిఘా పెంచింది. ఢిల్లీలో జీ-20 సదస్సు జరుగుతోంది. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు. అయితే, వీరి భేటీ తరువాత చైనా సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ తన కార్యకలాపాలను పెంచింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కు భారత ఆర్మీ దళాలు చేరుకున్నాయి. ఎల్ఏసీ చుట్టూ ప్రాంతాల్లో గుర్రాలు, గాడిదలతో ఆర్మీ సిబ్బంది సంచరిస్తున్న వీడియోలతోపాటు, పాంగోంగ్ సరస్సుపై భద్రత చర్యల్లో పాల్గొన్న వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

 

 

2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్ (పీసీ)14 వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో భారత సైనికులు 20 మంది మరణించారు. ఉన్నట్టుండి ఆ ప్రాంతం రణక్షేత్రంగా మారింది. పలువురు భారత సైనికులకు గాయాలయ్యాయి. అయితే ఈ ఘర్ణణలో చైనా సైనికులు 40మందికిపైగా చనిపోయినట్లు తెలిసింది. ఆ తరువాత ఇండియా, చైనా మధ్య చర్చల అనంతరం ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అదే ప్రాంతంలో భారత ఆర్మీ పటిష్ఠ భద్రను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పటియాలా బ్రిగేడ్ కు చెందిన త్రిశూల్ డివిజన్‌లో సైనికులు సరదాగా క్రికెట్ ఆడుతూ కనిపించారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత ఆర్మీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. పీపీ-14 కు కేవలం నాలుగు కిలో మీటర్ల దూరంలోక్రికెట్ ఆడుతున్నట్లు తెలుస్తోంది.

 

గడ్డకట్టే చలిలోసైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో రాసుకొచ్చింది. గల్వాన్ ఘటన తర్వాత భారత్ – చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరిపి పెట్రోలింగ్ పాయింట్ 14కు 1.5 కిలో మీటర్ల దూరం నుంచి బఫర్ జోన్ గా ప్రకటించారు. తాజాగా బఫర్ జోన్ కు సమీపంలోనే భారత సైన్యం క్రికెట్ ఆడినట్లు తెలుస్తోంది.