Nehru To Modi : నెహ్రు నుంచి మోదీ వరకు.. మంత్రివర్గం ఇలా

తాజాగా మోదీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేసిన విషయం విదితమే.. ఈ విస్తరణలో కొత్తగా 43 మందికి మంత్రి పదవులు దక్కగా.. నలుగురు సీనియర్ నేతలు పదవులు కోల్పోయారు. ఇక ఈ 43 మందిలో 7 గురు మోదీ 1.0లో మంత్రులుగా పనిచేసి 2.0లో ప్రొమోషన్ పొందారు. మిగిలినవారు మొదటి సారి మంత్రిపదవులు పొందారు.

Nehru To Modi : నెహ్రు నుంచి మోదీ వరకు.. మంత్రివర్గం ఇలా

Nehru To Modi

Nehru To Modi : తాజాగా మోదీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేసిన విషయం విదితమే.. ఈ విస్తరణలో కొత్తగా 43 మందికి మంత్రి పదవులు దక్కగా.. నలుగురు సీనియర్ నేతలు పదవులు కోల్పోయారు. ఇక ఈ 43 మందిలో 7 గురు మోదీ 1.0లో మంత్రులుగా పనిచేసి 2.0లో ప్రొమోషన్ పొందారు. మిగిలినవారు మొదటి సారి మంత్రిపదవులు పొందారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో 13 మంది మహిళలకు చోటుకల్పించారు. కేబినెట్లో ఉన్నత విద్యావంతులకు పెద్దపీఠ వేసిన మోదీ.. ఏ సభలో సభ్యుడు కానీ సర్బానంద సోనోవాల్‌ కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టారు.

ఏ సభల్లో సభ్యులు కానీ వారికి మంత్రి పదవి ఇవ్వడం ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న నాటి నుంచి మొదలైంది. 1977లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో త్రిగున్ సేన్ ఏ సభలో సభ్యత్వం లేకపోయిన మంత్రి పదవి ఇచ్చారు ఇందిరా.. ఆ తర్వాత శాంతి భూషణ్, అర్జున్ సింగ్, మన్మోహన్ సింగ్, శరద్ పవార్ కూడా ఏ సభలో సభ్యులు కాకుండానే మంత్రి పదవులు చేపట్టారు.

తోలి లోక్ సభ నుంచి 17వ లోక్ సభ వరకు ఎవరి హయాంలో ఎంతమంది మంత్రులు ఉన్నారనే దాన్ని తెలుసుకుందాం.
ఇక ఈ సమయంలోనే మనం ఓ సారి నెహ్రు మంత్రి వర్గం గురించి తెలుసుకోవాలి. 1947 జవహర్ లాల్ నెహ్రు ప్రధానిగా 14 మందితో మంత్రివర్గం ఏర్పడింది. ఇందులో ఉన్నత విద్యావంతులు సర్ధార్ వల్లభాయ్ పటేల్, డా.రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబెడ్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీలకు స్థానం దక్కింది. నెహ్రు మంత్రివర్గంలో ఒకే ఒక్క మహిళకు స్థానం కల్పించారు. హిమాచల్ లోని మండి నుంచి గెలిచిన రాజ్ కుమారి అమృత్ కౌర్ కు తోలి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు.

ఇక నెహ్రు కేబినెట్ లో ఓ బ్యూరోక్రాట్ మంత్రి పదవి ఇచ్చారు. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేసిన సీ.హెచ్ భాభాకు నెహ్రు మంత్రి పదవి ఇచ్చారు. ఇక మోదీ మంత్రివర్గంలో కూడా బ్యూరోక్రాట్ కు మంత్రి పదవి ఇచ్చారు. గతంలో రష్యాలోని ఇండియన్ ఎంబసీలో సెక్రెటరీగా పనిచేసిన బ్యూరోక్రాట్ ఎస్.జయశంకర్ కు విదేశాంగ మంత్రి పదవి ఇచ్చారు మోదీ. 2019 మంత్రి పదవి చేపట్టినప్పుడు జయశంకర్ కూడా ఏ సభలో సభ్యుడిగా లేరు.

ఇక స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నీటి వరకు ఏర్పడిన మంత్రివర్గాల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఒకసారి పరిశీలిద్దాం.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేబినెట్ లో మంత్రుల సంఖ్య చూస్తే.. 1947లో జవహర్ లాల్ నెహ్రు ప్రధానిగా ఉన్న సమయంలో 14 మంది మంత్రులు, 1952లో 21, 1957లో 38, 1962లో 22, 1967లో 30, 1967లో లాల్ బహదూర్ శాస్త్రి కేబినెట్ లో 29, 1966లో ఇందిరా కేబినెట్ లో 42, 1967లో 30, 1971లో 36, 1977లో 30, 1979లో 32, 1980లో 22, 1984లో 49, 1989లో 24, 1989లో 54, 1991లో 12, ​​1996లో 12 , 1997లో 34, 1988లో 43, 1999లో 70, 2004లో 68 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఆ తరువాత, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన 2009లో 79 మంది కేబినెట్ మంత్రులు కాగా 2014లో మోడీ కేబినెట్లో 46 మంది మంత్రులు, 2019లో 58 మంది మంత్రులు, 2021లో కేబినెట్ విస్తరణ తరువాత 78 మంది మంత్రులు ఉన్నారు.