Ravindra Jadeja: ఆసియా కప్ నుంచి జడేజా ఔట్… అక్సర్ పటేల్‌కు అవకాశం

కుడి మోకాలికి అయిన కారణంగా ఆసియా కప్‌కు దూరం కానున్నాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. జడేజా స్థానంలో అక్సర్ పటేల్ జట్టుతో చేరనున్నాడు.

Ravindra Jadeja: ఆసియా కప్ నుంచి జడేజా ఔట్… అక్సర్ పటేల్‌కు అవకాశం

Ravindra Jadeja: ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా టోర్నమెంట్‪‌కు దూరం కానున్నాడు. కుడి మోకాలి గాయంతో బాధపడుతున్న ఆయన ఆసియా కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Pawan Kalyan: విజయవాడలో వైసీపీ-జనసేన ఘర్షణ.. ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

జడేజా స్థానంలో మరో ఆటగాడు అక్సర్ పటేల్ జట్టుతో చేరనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా.. బీసీసీఐకి చెందిన వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్ విజయవంతంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. రెండు వరుస విజయాలతో సూపర్-4లోకి ప్రవేశించింది టీమిండియా. గత జూలైలో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మూడు మ్యచుల సిరీస్‌లో జడేజా మోకాలికి గాయమైంది. అదే గాయం మరింత ఇబ్బందిగా మారడంతో ప్రస్తుతం అతడు టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రవీంద్ర జడేజా త్వరగా కోలుకోవడం భారత జట్టుకు చాలా అవసరం.

BJP: తెలంగాణకు అమిత్ షా.. 17న బీజేపీ భారీ బహిరంగ సభ.. ఏడాదిపాటు విమోచన దినోత్సవాలు

వచ్చే టీ 20 వరల్డ్ కప్‌కు జడేజా అందుబాటులోకి రావాలి. వచ్చే అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. మరోవైపు ఇటీవలి కాలంలో రవీంద్ర జడేజా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఆసియా కప్‌లో భారత్ ఆడిన రెండు మ్యాచుల్లో జడేజా ఆడాడు. ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో బ్యాటింగులోనూ రాణించాడు. 29 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.