BJP: తెలంగాణకు అమిత్ షా.. 17న బీజేపీ భారీ బహిరంగ సభ.. ఏడాదిపాటు విమోచన దినోత్సవాలు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ ఆలోచిస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 17న తెలంగాణలో భారీ బహిరంగ సభకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారు.

BJP: తెలంగాణకు అమిత్ షా.. 17న బీజేపీ భారీ బహిరంగ సభ.. ఏడాదిపాటు విమోచన దినోత్సవాలు

BJP: తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, విముక్తి దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.

Pawan Kalyan: విజయవాడలో వైసీపీ-జనసేన ఘర్షణ.. ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఈ విముక్తి దినోత్సవానికి అమిత్ షాతోపాటు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా తెలంగాణలో పర్యటిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. సభకు బూత్‌స్థాయి కార్యకర్తలు, అధ్యక్షులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించింది.

Jubilee Hills rape case: జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక పరిణామం.. నిందితులను మేజర్లుగా పరిగణించాలని పోలీసుల పిటిషన్

75వ స్వాతంత్ర్య దినోత్సవాల్ని ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఏడాదిపాటు నిర్వహించినట్లుగానే, తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలు కూడా ఏడాదిపాటు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలొస్తాయని బీజేపీ భావిస్తోంది. అందుకే వివిధ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలకు దగ్గరవ్వాలని బీజేపీ ఆలోచిస్తోంది.