Anand Mahindra : అరే..కారు డోర్ కాదా..?! ఆనంద్ మహీంద్రా కళ్లలో ఈ కారు ‘గేట్‘ కూడా పడింది..

కొత్త ఆలోచనలు ఎక్కడున్నా..ఎవరికి ఉన్నా.. ప్రోత్సహించాలి అనేది ఆనంద మహీంద్రా ఆలోచన. అటువంటి మరో టాలెంట్ వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా

Anand Mahindra : అరే..కారు డోర్ కాదా..?! ఆనంద్ మహీంద్రా కళ్లలో ఈ కారు ‘గేట్‘ కూడా పడింది..

Anand Mahindra

Anand Mahindra : ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ షేర్ చేశారు అంటే దాంట్లో ఏదో వినూత్నత ఉండే తీరుతుంది. కొత్త ఆలోచనలు ఎక్కడున్నా..ఎవరికి ఉన్నా.. ప్రోత్సహించాలి అనేది ఆనంద మహేంద్ర ఆలోచన. అందుకే ఆయన ట్విట్టర్ లో ఎప్పుడూ టాలెంట్ వీడియోలు కుప్పలు తెప్పలుగా ఉంటుంటాయి.అటువంటి మరో వీడియో షేర్ చేశారు మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా. ఈసారి ఆనంద్ మహీంద్రా కళ్లు ఓ కారు డోర్ మీద పడ్డాయి..హా..కాదు కాదు..అది కారు డోర్ కాదు..ఇంటి ప్రహరీ గేట్ మీద పడ్డాయి. ప్రహరీ గేట్ కు ఎటువంటి కొత్తదనం ఉందా? అనే ఆసక్తి పెరిగింది కదూ…కారు కదులుతుంది…ఇంటి ప్రహరీ గేటు తెరుచుకుంటుంది. ఇదే ఈ వీడియోలోని కొత్తదనం..

అది ఓ ఇంటి ముందున్న ప్రహరీ గేటు. దాన్ని మామూలుగా చూస్తే అదోకారు డోరు అనుకుంటాం. కానీ కాదు..అది ఇంటి ప్రహరీ గేటు అని తెలుసుకుంటే హా…అంటూ నోరెళ్యలబెడతాం. బాగా పరిశీలించి చూస్తేనే ఆ విషయం తెలుస్తుంది. లేదంటే దాన్ని కారు అనే అనుకుంటాం. ఎందుకంటే అది కారు మాదిరే అటూ ఇటూ కదులుతుంది. కారు మ మాదిరే డోర్లు, విండోలు కనిపిస్తాయి. కారు అంటే మమకారం ఉన్న ఓ వ్యక్తి తన గేటుకు వినూత్నంగా చేసుకున్న ఏర్పాటు ఇది. ఈ కారు డోరు ప్రహరీ గేటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఆనంద మహీంద్రా షేరింగ్ తో..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా కళ్లలో ఈ కారు (గేట్) కూడా పడింది. ఇలాంటి అరుదైన విశేషాలను షేర్ చేయడంలో ముందుండే ఆనంద్ మహీంద్రా దీన్ని కూడా తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి, తన అభిప్రాయాలను కూడా కొన్ని పాయింట్ల ద్వారా షేర్ చేశారు..అవేంటో చూసేద్దాం..అలాగే ఈ కారుడోరులా ఉండే ప్రహరీ గేట్ ను కూడా చూసేయండీ..

‘‘ఈ వ్యక్తి..
1. కారు అంటే ఎంతో అభిరుచి కలిగిన వ్యక్తి?
2. ఎవరూ తన ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించకూడదనుకునే అంతర్ముఖుడు?
3. చమత్కారంతో కూడిన హాస్యం కలిగిన వ్యక్తి?
4. పై వన్నీ కూడా?’’
ఈ ఆప్షన్లలో ఏది అతడికి సరిపోతుందో కామెంట్లు రూపంలో చెప్పమని కోరినట్టుగా ఆనంద్ మహీంద్రా ఆప్షన్లతో పోస్ట్ పెట్టారు. నెటిజన్లు ఉత్సాహంగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. కొత్త ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు.