GST on Helmets: హెల్మెట్లపై జీఎస్టీ ఎత్తివేయండి.. కేంద్రానికి సూచించిన అంతర్జాతీయ రహదారుల సమాఖ్య

రోడ్డు ప్రమాదాలు తగ్గాలన్నా, టూ వీలర్స్ నడిపే వాళ్లు క్షేమంగా ఉండాలన్నా హెల్మెట్లు తప్పనిసరిగా ధరించేలా చూడాలని ఐఆర్ఎఫ్ సూచిస్తోంది. దీనిలో భాగంగా మన దేశంలో హెల్మెట్లపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది.

GST on Helmets: హెల్మెట్లపై జీఎస్టీ ఎత్తివేయండి.. కేంద్రానికి సూచించిన అంతర్జాతీయ రహదారుల సమాఖ్య

GST on Helmets: హెల్మెట్లపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్రానికి సూచించింది అంతర్జాతీయ రహదారుల సమాఖ్య (ఐఆర్ఎఫ్). దీని ద్వారా హెల్మెట్లు తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చి, ఎక్కువ మంది వాహనదారులు హెల్మెట్లు ధరిస్తారని ఐఆర్ఎఫ్ అభిప్రాయపడింది.

Nora Fatehi: గల్‌ఫ్రెండుగా ఉంటే ఖరీదైన ఇల్లు ఇస్తానన్నాడు.. సుకేష్ చంద్రశేఖర్‌పై నోరా ఫతేహి ఆరోపణ

ఐఆర్ఎఫ్.. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్ని పర్యవేక్షిస్తూ, ప్రభుత్వాలకు తగిన సూచనలు చేసే సంస్థ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఐఆర్ఎఫ్ నివేదికలు రూపొందిస్తుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుంది. ఐఆర్ఎఫ్ అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 11 శాతం ఇండియాలోనే జరుగుతున్నాయి. అందులోనూ టూ వీలర్ నడిపే వాళ్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. వీటిలో 31.4 శాతం మంది వాహనదారులు హెల్మెట్లు లేకపోవడం వల్ల, తలకు గాయాలై మరణిస్తున్నారు. అందుకే రోడ్డు ప్రమాదాలు తగ్గాలన్నా, టూ వీలర్స్ నడిపే వాళ్లు క్షేమంగా ఉండాలన్నా హెల్మెట్లు తప్పనిసరిగా ధరించేలా చూడాలని ఈ సంస్థ సూచిస్తోంది.

Rakhi Sawant: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అరెస్ట్.. షెర్లిన్ చోప్రా ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు

దీనిలో భాగంగా మన దేశంలో హెల్మెట్లపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ మేరకు ఒక లేఖలో తాజా సూచన చేసింది. రాబోయే బడ్జెట్‌లో హెల్మెట్లపై జీఎస్టీని ఎత్తివేయాలని సూచించింది. పూర్తి నాణ్యతా ప్రమాణాలు కలిగిన హెల్మెట్లు వాడటం వల్ల రోడ్డు ప్రమాదాల్ని తగ్గించవచ్చని ఐఆర్ఎఫ్ ప్రతినిధి కేకే కపిల లేఖలో పేర్కొన్నారు. మన దేశంలో హెల్మెట్ల వాడకం తక్కువగా ఉంది. టూ వీలర్స్ వాడే వాళ్లు ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన వాళ్లే అయ్యుంటారు. దీంతో చాలా మంది హెల్మెట్లు కొనడం లేదు. ఒకవేళ కొన్నప్పటికీ నాణ్యతలేని, తక్కువ ధర కలిగిన హెల్మెట్లు కొంటున్నారు. దీంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది.