అభినందన్ విడుదలపై పిటిషన్ కొట్టివేత

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2019 / 09:42 AM IST
అభినందన్ విడుదలపై పిటిషన్ కొట్టివేత

పాక్ నిర్బంధంలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ విక్రమ్ అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా పాక్ కు చెందిన ఓ సామాజిక కార్యకర్త శుక్రవారం (మార్చి-1,2019)  దాఖలు చేసిన పిటిషన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి పాక్ గగనతలంలోకి ప్రవేవించి నేరం చేశాడని, దేశంపై బాంబులు వేసేందుకు వచ్చినట్లు ఈ పిటిషన్ లో తెలిపాడు. ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం దాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

అభినందన్ ను విడుదల చేయాల్సిందింగా అధికారులను ఆదేశించింది. పాక్ లోని భారత హైకమిషనర్ గౌరవ్ అహ్లూవాలియా అక్కడి విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి అభినందన్ విడుదలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు. వాఘా సరిహద్దు గుండా భారత్ లోకి రానున్న అభినందన్ కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది.
Read Also : మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే