Remarks: మద్యం దొరక్కే కోపంతో ఉన్నారు.. మీడియాపై జేడీయూ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

తరుచూ ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. నిజానికి వారికి మద్యం దొరకపోవడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭పై ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఏదో ఒకటి రాస్తున్నారు. దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్రం బిహార్. రాష్ట్రంలోని మహిళల కోసం మద్య నిషేధం అమలు చేస్తున్నాం. అలా అని మీడియా ప్రతినిధుల సంతోషం కోసం నిషేధాన్ని ఎత్తివేయలేం

Remarks: మద్యం దొరక్కే కోపంతో ఉన్నారు.. మీడియాపై జేడీయూ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

JDU president rajeev ranjan remarks on media

Remarks: మీడియా ప్రతినిధులపై జనతాదళ్ యూనైటెడ్ (జేడీయూ) అధినేత రాజీవ్ రంజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియా వారికి మద్యం దొరకకపోవడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭పై కోపంతో ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ మద్యం ఏరులై పారుతోంది. ఈ విషయమై మీడియాలో అనేక కథనాలు, వార్తలు ప్రచురితం అవుతున్నాయి. ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయడంలో విఫలమైనట్లు అనేక విమర్శలు సైతం ఉన్నాయి. అయితే వీటిపై రాజీవ్ రంజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీడియాపై విమర్శలు నిప్పులు చెరిగారు.

‘‘తరుచూ ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. నిజానికి వారికి మద్యం దొరకకపోవడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭పై ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ప్రభుత్వాన్ని నిందించడానికి తరుచే ఏదో ఒకటి రాస్తున్నారు. దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్రం బిహార్. రాష్ట్రంలోని మహిళల కోసం మద్య నిషేధం అమలు చేస్తున్నాం. అలా అని మీడియా ప్రతినిధుల సంతోషం కోసం నిషేధాన్ని ఎత్తివేయలేం’’ అని లఖిసరాయి జిల్లాలో జరిగన సమావేశంలో ఆయన అన్నారు.

2015 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిహార్ రాష్ట్రంలో మద్య నిషేదం అమలు చేస్తామని నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకు అంటే 2016 నుంచి అధికారికంగా మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అయితే వాస్తవంలో మద్యపానాన్ని, మద్యం రవాణాను ప్రభుత్వం అరికట్టలేకపోయిందని తెలుస్తోంది. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంస్థ ఆ మధ్య విడుదల చేసిన వివరాల ప్రకారం.. మద్యపానం అమలులో ఉన్న మహారాష్ట్ర కంటే నిషేధం ఉన్న బిహార్‭లోనే మద్యం సరఫరా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

Anand Sharma: ఆ రెండు గ్రూపులతో కాంగ్రెస్ పుంజుకోదు: సీనియర్ లీడర్ ఆనంద్ శర్మ